![]() |
![]() |

బుల్లితెర హాట్ యాంకర్, వెండితెర రంగమ్మత్త అనసూయకు మరో భారీ సినిమాలో నటించే అవకాశం వచ్చింది. మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న తాజా సినిమా 'ఖిలాడీ'లో ఓ కీలక పాత్రలో ఆమె నటించనుంది. ఈ సంగతి తెలిసిందే. కొత్త విషయం ఏంటంటే... ఇందులో అనసూయ పాత్ర పేరు కాదు క్యారెక్టర్ కూడా 'అదుర్స్'లో నయనతారలా ఉంటుందట.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేసిన 'అదుర్స్' చిత్రంలో నయనతార ఓ కథానాయికగా నటించారు. అందులో ఆమె పేరు చంద్రకళ. 'ఖిలాడీ'లో అనసూయ పేరు కూడా అదే! 'అదుర్స్'లో బ్రాహ్మణుల అమ్మాయి పాత్రలో నయనతార కనిపించారు. 'ఖిలాడీ'లో అనసూయ కూడా బ్రాహ్మణుల అమ్మాయిగా కనిపించనున్నారు. పాత్ర పేరు, నేపథ్యమే కాదు... రెండిటి మధ్య చాలా సారూప్యతలు ఉన్నాయట.
'ఖిలాడీ'లో కథను ముందుకు నడిపించే పాత్రలో అనసూయ కనిపిస్తారని దర్శకుడు రమేష్ వర్మ తెలిపారు. ఈ సినిమాలో మీనాక్షి చౌధరి, డింపుల్ హయాతి కథానాయికులు.
![]() |
![]() |