![]() |
![]() |

రాజమౌళి రూపొందిస్తోన్న 'ఆర్ఆర్ఆర్' ఇండియాలో నిర్మాణమవుతోన్న బిగ్గెస్ట్ ఫిలిమ్స్‌లో ఒకటి. లాక్డౌన్ తర్వాత ఇటీవలే ఈ సినిమా షూటింగ్‌ను ఆయన పునరుద్ధరించారు. ఈ షూటింగ్‌కు సంబంధించిన పిక్చర్లు, షార్ట్ వీడియోలు ఇంటర్నెట్లో హల్చల్ చేస్తున్నాయి. కాగా రాజమౌళి, ఆయన టీమ్ గ్రీన్ ఇండియా చాలెంజ్‌ను స్వీకరించి, తాము షూటింగ్ చేస్తున్న ఏరియాలో మొక్కలను నాటారు.
గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో భాగంగా పలువురు సెలబ్రిటీలు మొక్కలను నాటుతూ, ఆ చాలెంజ్‌ను స్వీకరించమని తమ ఫ్రెండ్స్‌ను నామినేట్ చేస్తూ వస్తున్నారు. దాంతో పాటు మొక్కలను నాటమంటూ తమ ఫ్యాన్స్‌లో వారు స్ఫూర్తి నింపుతున్నారు. తద్వారా మంచి పర్యావరణాన్ని కల్పించేందుకు కృషి చేస్తున్నారు.
రామ్‌చరణ్ నామినేట్ చేసిన విధంగా తాము గ్రీన్ ఇండియా చాలెంజ్‌ను స్వీకరించి మొక్కలను నాటినట్లు తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా రాజమౌళి తెలిపారు. డైరెక్టర్లు రామ్ గోపాల్ వర్మ, వినాయక్, పూరి జగన్నాథ్ పేర్లను ఆయన నామినేట్ చేశారు.

![]() |
![]() |