![]() |
![]() |

అనసూయ భరద్వాజ్, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రలు పోషించిన 'థాంక్యూ బ్రదర్' మూవీ నేరుగా ఓటీటీలో విడుదలకు సిద్ధమైంది. రమేశ్ రాపర్తి డైరెక్ట్ చేసిన ఈ మూవీ మే 7న ఆహాలో స్ట్రీమింగ్ కానున్నది. కరోనా సెకండ్ వేవ్ దెబ్బకు తెలుగు రాష్ట్రాల్లో రాత్రిపూట కర్ఫ్యూ విధించడం, కరోనా కేసులు ఇబ్బడిముబ్బడిగా పెరుగుతుండటంతో థియేటర్ల సంఘాలు థియేటర్ల మూసివేతకు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీంతో థాంక్యూ బ్రదర్‌ను ఓటీటీలో నేరుగా రిలీజ్ చేయాలని నిర్మాత మాగుంట శరత్‌చంద్రా రెడ్డి నిర్ణయించుకున్నారు.
ఒక ఆసక్తికర కథాంశంతో 'థాంక్యూ బ్రదర్' రూపొందింది. ప్లేబాయ్ లాంటి ఓ యువకుడు, గర్భవతి అయిన ఓ యువతి అనూహ్యమైన పరిస్థితుల్లో ఓ లిఫ్టులో చిక్కుకుపోతారు. ఆ సందర్భంలో ఆ ఇద్దరి ప్రవర్తన ఎలా ఉంటుంది, వారి ఎమోషన్స్ ఎలా ఉంటాయి?.. అనేది ఇందులోని ప్రధానాంశం. అనసూయ భర్తగా ఆదర్శ్ బాలకృష్ణ నటించాడు.
నిజానికి ఈ చిత్రాన్ని ఈ నెలలో విడుదల చేయాలని మేకర్స్ భావించారు. అయితే ప్రస్తుతం కొవిడ్ సెకండ్ వేవ్ ప్రభావం ఎక్కువగా ఉండటంతో పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని తెలుగు ఓటీటీ మాధ్యమం 'ఆహా'లో మే 7న విడుదల చేయడానికి నిర్ణయించుకున్నారు. ఈ ఏడాదిలో క్రాక్, గాలి సంపత్, నాంది, లెవన్త్ అవర్, మెయిల్, తెల్లవారితే గురువారం, చావు కబురు చల్లగా చిత్రాల తర్వాత ఆహాలో రిలీజవుతున్న సినిమా 'థాంక్యూ బ్రదర్'.

![]() |
![]() |