![]() |
![]() |

`సినిమా చూపిస్త మావ`, `నేను లోకల్` చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్నాడు దర్శకుడు త్రినాథరావ్ నక్కిన. ఆ తరువాత వచ్చిన `హలో గురు ప్రేమ కోసమే` జస్ట్ ఓకే అనిపించుకుంది. ఈ సినిమా విడుదలై రెండున్నర సంవత్సరాలు దాటినా త్రినాథరావ్ నుంచి మరో చిత్రం రాలేదు. అయితే, రీసెంట్ గా మాస్ మహారాజా రవితేజతో త్రినాథరావ్ నక్కిన నెక్స్ట్ వెంచర్ ఉండబోతున్నట్లు అధికారిక ప్రకటన వచ్చింది. మాస్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్.. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ కి వెళ్ళనుంది.
ఇదిలా ఉంటే.. ఈ చిత్రంలో ఇద్దరు కథానాయికలకు స్థానముందని ఇప్పటికే కథనాలు వచ్చాయి. లేటెస్ట్ బజ్ ఏంటంటే.. `ఇస్మార్ట్` పోరి నభా నటేశ్, `గ్యాంగ్ లీడర్` భామ ప్రియాంక అరుళ్ మోహన్ ఆ పాత్రలకు ఎంపికయ్యారట. అదే గనుక నిజమైతే.. `డిస్కోరాజా` తరువాత రవితేజతో నభా నటించే సినిమా ఇదే అవుతుంది. ఇక ప్రియాంకకి మాత్రం మాస్ మహారాజాతో ఇదే ఫస్ట్ కాంబినేషన్ మూవీ. త్వరలోనే రవితేజ - త్రినాథరావ్ నక్కిన కాంబో మూవీలో నభా, ప్రియాంక ఎంట్రీపై క్లారిటీ వచ్చే అవకాశముంది.
![]() |
![]() |