![]() |
![]() |

రాధ.. నిన్నటి తరం అగ్ర కథానాయిక. అలాంటి రాధ నటవారసురాలిగా వెండితెరపైకి వచ్చింది కార్తిక. యువ సామ్రాట్ నాగచైతన్య కథానాయకుడిగా నటించిన మొదటి సినిమా `జోష్` (2009)తోనే కార్తిక కూడా తెరంగేట్రం చేసింది. ఆ సినిమా ఆశించిన విజయం సాధించకపోయినా.. కోలీవుడ్ డెబ్యూ మూవీ `కో` (తెలుగులో `రంగం`)తో ఫస్ట్ సక్సెస్ చూసింది కార్తిక. ఆపై తెలుగు, తమిళ భాషలతో పాటు మలయాళం, కన్నడంలోనూ సందడి చేసింది. దక్షిణాది మొత్తం చుట్టేసినా.. తల్లికి తగ్గ తనయ అని మాత్రం అనిపించుకోలేకపోయింది కార్తిక.
ఇదిలా ఉంటే.. నటుడు విజయ్ కుమార్ తనయుడు అరుణ్ విజయ్ తో కలసి `వా డీల్` పేరుతో 2012లో ఓ సినిమా చేసింది కార్తిక. రతినా శివ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ డ్రామా.. ఏవేవో కారణాలతో వాయిదా పడుతూ వస్తోంది. లేటెస్ట్ బజ్ ఏంటంటే. ఎట్టకేలకు `వా డీల్` జనం ముందుకు రానుంది. అయితే, థియేటర్స్ లో కాకుండా నేరుగా ఓటీటీలో ఈ సినిమా స్ట్రీమ్ కానుందట. త్వరలోనే `వా డీల్` స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ తో పాటు స్ట్రీమింగ్ డేట్ కి సంబంధించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది. యువ సంగీత సంచలనం తమన్ స్వరకల్పనలో `వా డీల్` రూపొందింది. మరి.. డీలే మీద డీలే అన్నట్లుగా సాగిన `వా డీల్`.. ఓటీటీలో వీక్షకాదరణ పొందుతుందేమో చూడాలి.
![]() |
![]() |