![]() |
![]() |
.jpg)
'గుడుంబా శంకర్'లో పవన్ కల్యాణ్‌తో స్క్రీన్ షేర్ చేసుకున్నారు జ్యోతి. ఆ సినిమాలో ఆమెది గుర్తుండిపోయే పాత్ర. ఎదురైనప్పుడల్లా ఆమె మీద ఆయన, ఆయన మీద ఆమె పడిపోతుంటారు. ఆ సందర్భాలను గుర్తుచేసుకుంటూ, "ఆ సీన్లు రిహార్సల్స్ చేస్తున్నప్పుడు నాకు ఇదేదో బాగుంది అనిపించేది. ఇంకో రెండు మూడు రిహార్సల్స్ చేసుకుందాం అనికూడా అనిపించేది. ఆయన నా ఫేవరేట్ హీరోల్లో ఒకరు కాబట్టి లోపలి ఫీలింగ్స్ తన్నుకొని వచ్చేవి." అని బోల్డ్‌గా చెప్పేశారు జ్యోతి.
సెట్స్ మీద పవన్ కల్యాణ్ ఎలా ఉండేవారో చెబుతూ, తన మీద కవిత్వం కూడా ఆయన రాశారని ఆమె తెలిపారు. "లొకేషన్లలో పవన్ కల్యాణ్ ఎంతో జోవియల్‌గా ఉండేవారు. ఆడుతూ పాడుతూ, కవిత్వాలు రాస్తూ ఉండేవారు. నామీద కవిత్వాలు రాశారు. బాగా పదాలు కూర్చి రాసేవారు. గుడుంబా శంకర్ సినిమాలో పెళ్లి సీన్ ఉంది. బంతిపూల డెకరేషన్ అదీ ఉంటుంది కదా.. షాట్ గ్యాప్‌లో పవన్ కల్యాణ్ గారు కూర్చొని నామీద కవిత్వాలు రాసేవారన్న మాట. "జో.. నువ్విలా పువ్వుల మధ్య నుంచి వస్తుంటే.. ఆ కురులు.." అంటూ ఏవేవో రాసేవారు. వాటిని ఉత్తేజ్‌గారు తీసుకొచ్చి నాకు చూపించేవారు, చూడు నీపై పవన్ కల్యాణ్ కవిత్వం రాశారని. ఆయన నా గురించి రాస్తున్నారా అని నేను ఫ్లాటైపోయేదాన్ని." అని ఆమె చెప్పుకొచ్చారు.
"ఆయనతో కలిసి పనిచేసిన ఇంపార్టెన్స్ అప్పుడు నాకు తెలియలేదు. ఇప్పుడు తలచుకుంటే అనిపిస్తోంది, ఆ.. నేను పవన్ కల్యాణ్‌గారితో పనిచేశానని." అని ఆమె ఎగ్జయిట్ అయ్యారు. 'గబ్బర్ సింగ్' మూవీలో పనిచేసే అవకాశం వచ్చినా, డేట్స్ సర్దుబాటు కాకపోవడంతో ఆ సినిమా చేయాలేకపోయాననీ ఆమె చెప్పారు. అవకాశం లభిస్తే, మళ్లీ ఆయనతో కలిసి నటించాలని ఉందని ఆమె ఆకాంక్ష వ్యక్తం చేశారు.
.jpg)
ప్రస్తుతం ఆమె భర్త నుంచి విడిపోయి కొడుకును చూసుకుంటూ కాలం గడుపుతున్నారు. తనను అర్థం చేసుకునే మనిషి వస్తే, జీవితం పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నానని ఆమె తెలిపారు.
![]() |
![]() |