![]() |
![]() |

తమిళనాట కథానాయికగా మంచి గుర్తింపుని తెచ్చుకుంది తెలుగమ్మాయి ఐశ్వర్యా రాజేశ్. హాస్యనటి శ్రీలక్ష్మి మేనకోడలు, నటుడు రాజేశ్ కుమార్తె అయిన ఐశ్వర్య.. `కౌసల్య కృష్ణమూర్తి`, `వరల్డ్ ఫేమస్ లవర్` చిత్రాలతో తెలుగునాట కూడా నటిగా తనదైన ముద్ర వేసింది. త్వరలో ఈ టాలెంటెడ్ యాక్ట్రస్.. నేచురల్ స్టార్ నాని నటించిన `టక్ జగదీష్`లో సెకండ్ లీడ్ గా పలకరించనుంది.
ఇదిలా ఉంటే.. మెగా కాంపౌండ్ హీరోల చిత్రాల్లో భాగమవుతూ వార్తల్లో నిలుస్తున్న ఐశ్వర్య ఖాతాలో మరో మెగా ప్రాజెక్ట్ చేరిందని సమాచారం. ఆ వివరాల్లోకి వెళితే.. `సుప్రీమ్` హీరో సాయిధరమ్ తేజ్ కి జోడీగా `రిపబ్లిక్`లో నటించిన ఐశ్వర్యా రాజేశ్.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - దగ్గుబాటి రానా కాంబినేషన్ లో వస్తున్న `అయ్యప్పనుమ్ కోషియుమ్`లో రానాకి జంటగా దర్శనమివ్వనుంది. అలాగే యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ - మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మల్టిస్టారర్ `ఆర్ ఆర్ ఆర్`లోనూ ఓ కీలక పాత్రలో ఐశ్వర్య కనిపించనుందని ప్రచారం సాగుతోంది.
అంతేకాదు.. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తాజా చిత్రం `పుష్ప`లో కూడా ఐశ్వర్యా రాజేశ్ నటించబోతోందని బజ్. ఇందులో బన్నీకి చెల్లెలుగా అభినయానికి అవకాశమున్న పాత్రలో ఐశ్వర్య కనిపిస్తుందని టాక్. మరి.. ఈ మెగా కాంపౌండ్ చిత్రాలు ఐశ్వర్యా రాజేశ్ కెరీర్ కి ఏ మేరకు ప్లస్సవుతాయో చూడాలి.
![]() |
![]() |