![]() |
![]() |

సరైన పాత్ర పడాలే కానీ తనదైన అభినయంతో కట్టిపడేస్తుంది కేరళకుట్టి అమలా పాల్. తమిళ అనువాదం `ప్రేమఖైదీ`(2011)తో తెలుగువారికి చేరువైన అమల.. అవకాశం దొరికినప్పుడల్లా విభిన్న పాత్రల్లో కనిపిస్తూ మురిపిస్తోంది. తెలుగు చిత్రాల్లో తన ప్రతిభకు తగ్గ పాత్రలు దొరకలేదు కానీ.. అన్య భాషల్లో మాత్రం తనకి అలాంటి అవకాశాలు బాగానే లభించాయి. వాటి అనువాదాలు ఇక్కడి వారిని ఆకట్టుకున్నాయి కూడా.
ఇదిలా ఉంటే.. ఇప్పటి ట్రెండ్ కి తగ్గట్టే ఓటీటీ వేదికల్లోనూ అలరించే ప్రయత్నం చేస్తోంది అమల. ఇటీవల నెట్ ఫ్లిక్స్ నిర్మించిన తెలుగు ఆంథాలజీ `పిట్టకథలు`లో ఓ సెగ్మెంట్ లో తన యాక్టింగ్ తో మెస్మరైజ్ చేసిన ఈ టాలెంటెడ్ బ్యూటీ.. తాజాగా ఓ వెబ్ - సిరీస్ తో తెలుగు వీక్షకుల ముందుకొచ్చింది. ఆ సిరీస్ నే ఆహాలో స్ట్రీమ్ అవుతున్న `కుడి ఎడమైతే`. `యూటర్న్` ఫేమ్ పవన్ కుమార్ రూపొందించిన ఈ టైమ్ లూప్ బేస్డ్ సిరీస్ లో పోలీసాఫీసర్ దుర్గగా అమల కనిపించింది. పర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉన్న ఈ పాత్రకి నూటికి నూరుపాళ్ళు న్యాయం చేసింది అమల. మొత్తమ్మీద.. తెలుగు చిత్రాల్లో తన ప్రతిభకి తగ్గ పాత్రలు దక్కకపోయినా.. ఓటీటీ వేదికల్లో మాత్రం ఆ లోటు తీరుతుందనే చెప్పాలి. మరి.. మున్ముందు కూడా అమల మరిన్ని తెలుగు వెబ్ - సిరీస్ ల్లో అలరిస్తుందేమో చూడాలి.
![]() |
![]() |