![]() |
![]() |

'రాజావారు రాణిగారు' సినిమాతో కిరణ్ అబ్బవరం హీరోగా పరిచయమయ్యాడు. మొదటి సినిమాతో ఆకట్టుకున్న ఈ యంగ్ హీరో వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే ఆయన నటించిన 'ఎస్ ఆర్ కల్యాణ మండపం' విడుదలకు సిద్ధంగా ఉంది. శ్రీధర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా వచ్చేనెల 6వ తేదీన విడుదల కానుంది. దీంతోపాటు మరో మూడు సినిమాల్లో నటిస్తున్నాడు. అందులో 'సమ్మతమే' మూవీ ఒకటి. నేడు(జూలై 15) కిరణ్ అబ్బవరం పుట్టినరోజు సందర్బంగా ఈ సినిమా నుంచి ఫస్టులుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు.
గోపీనాథ్ రెడ్డి దర్శకత్వం వస్తున్న 'సమ్మతమే' సినిమాలో.. కిరణ్ కి జోడీగా చాందినీ చౌదరి నటిస్తోంది. ఫస్టులుక్ ను బట్టి ఇది గ్రామీణ నేపథ్యంలో సాగే ప్రేమకథ అని తెలుస్తోంది. పోస్టర్ లో కిరణ్ తన చేతిలో ట్రిమ్మర్ పట్టుకొని అద్దంలో చూసుకుంటూ చిరునవ్వు నవ్వుతుండగా.. చాందినీ ఆ పక్కనే నిల్చొని కిరణ్ వైపు ప్రేమగా చూస్తుంది. చీర కట్టులో చాందినీ చాలా అందంగా కనిపిస్తోంది. తాజాగా విడుదలైన ఈ పోస్టర్ ఆకట్టుకుంటోంది.

యూజీ ప్రొడక్షన్స్ పతాకంపై కె. ప్రవీణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శేఖర్ చంద్ర సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ 80 శాతం పూర్తయింది.
![]() |
![]() |