Home  »  News  »  ఆ వార్తలు నమ్మొద్దు.. నా దగ్గర డబ్బులున్నాయి: పీపుల్ స్టార్

Updated : Jul 15, 2021

పీపుల్ స్టార్ ఆర్.నారాయణమూర్తి ఆర్థికంగా చితికిపోయారంటూ ఇటీవల సోషల్ మీడియాలో వార్తలు షికార్లు చేస్తున్నాయి. ఇటీవల 'రైతన్న' సినిమా ప్రివ్యూ సందర్భంగా గద్దర్ మాట్లాడుతూ.. "నారాయణమూర్తికి ఇల్లు లేదు. ఆస్తి లేదు. బండి లేదు. నడుచుకుంటూ వెళతాడు" అని అన్నారు. గద్దర్‌ వ్యాఖ్యల నేపథ్యంలో.. నారాయణమూర్తి దీనస్థితిలో ఉన్నారని.. ఉండటానికి ఇల్లు కూడా లేక హైదరాబాద్ శివార్లలో అద్దె ఇంట్లో ఉంటున్నారని.. రకరకాల  వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో నారాయణమూర్తి స్పందిస్తూ.. ఆ వార్తల్లో నిజం లేదని అన్నారు. 

తనపై ప్రేమతో, అభిమానంతోనే గద్దర్ అలా చెప్పారని నారాయణమూర్తి తెలిపారు. ఆరోజు గద్దర్‌ అన్న మాట్లాడేటప్పుడు కూడా 'అన్నా నా దగ్గర డబ్బులున్నాయ్‌' అని ఆయనతో చెప్పానన్నారు. అద్దె కట్టలేక ఇబ్బంది పడుతున్నాననే వార్తలు అవాస్తవమని.. పల్లెటూరి వాతావరణంలో ఉండటం ఇష్టం కాబట్టే సిటీకి దూరంగా ఉంటున్నానని చెప్పారు. ఆ వార్తలను చూసి.. చాలామంది తనకు ఫోన్లు చేసి ఆర్థికంగా సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నామని అంటున్నారని.. ఇవన్నీ తనను మానసికంగా కుంగదీశాయని నారాయణమూర్తి అన్నారు. 

సిటీలో ప్రయాణించడానికి తనకు ఆటోకి రోజుకు వెయ్యి రూపాయలు ఖర్చవుతుందని.. అంటే నెలకు రూ.30 వేలు కేవలం ఆటోలకే ఖర్చు చేస్తున్నానని చెప్పారు. తనకు ఇల్లు ఇస్తానని గతంలో కొందరు అధికారులు చెప్పినా తాను తీసుకోలేదని అన్నారు. తనకు అవసరం అయితే ఆర్థికంగా సాయం చేయగలిగే స్నేహితులు ఉన్నా.. వారిని ఉపయోగించుకోవడం తనకు ఇష్టం ఉండదని చెప్పారు. తన ఆర్థిక పరిస్థితిపై రాస్తున్న అసత్య వార్తలు తన మనసుకు బాధను కలిగిస్తున్నాయని.. దయచేసి అలాంటి వాటిని ప్రచారం చేయవద్దని నారాయణమూర్తి కోరారు. 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.