![]() |
![]() |

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఛత్రపతి. 2005లో విడుదలైన ఈ సినిమా సంచలన విజయం సాధించింది. అయితే ఇప్పుడు ఈ మూవీని బాలీవుడ్‌లో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ద్వారా టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమాలను జరుపుకుంది.
బెల్లంకొండ శ్రీనివాస్, వీవీ వినాయక్ కాంబినేషన్లో తెరకెక్కనున్న 'ఛత్రపతి' హిందీ రీమేక్ ఆదివారం హైదరాబాద్ లో పూజా కార్యక్రమాలను జరుపుకుంది. బెల్లంకొండ శ్రీనివాస్ పై రాజమౌళి క్లాప్ ఇవ్వడంతో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. తొలి షాట్ కి ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం గౌరవ దర్శకత్వం వహించారు. కథా రచయిత విజయేంద్ర ప్రసాద్ స్క్రిప్ట్ అందించారు.

'పెన్' స్టూడియోస్ వారు ఛత్రపతి రీమేక్ ను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగు ప్రారంభమైంది. మరి ఛత్రపతి రీమేక్ తో బెల్లంకొండ హిందీ ప్రేక్షకులను మెప్పిస్తారేమో చూడాలి.
![]() |
![]() |