![]() |
![]() |

ప్రముఖ బాలీవుడ్ సీనియర్ నటి సురేఖా సిక్రీ (75) కన్నుమూశారు. గత కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న సురేఖా సిక్రీ.. శుక్రవారం ఉదయం గుండె పోటుతో మరణించారని ఆమె మేనేజర్ మీడియాకు తెలిపారు.
సురేఖా సిక్రీ ఏప్రిల్ 19 1945న జన్మించారు. 1978 లో 'కిస్సా కుర్సి కా' చిత్రంతో తెరంగేట్రం చేశారు. హిందీ, మలయాళ భాషల్లో పలు చిత్రాల్లో నటించారు. తమాస్ (1988), మమ్మో (1995), బధాయ్ హో (2018) చిత్రాలకు గానూ ఉత్తమ నటిగా మూడు నేషనల్ అవార్డులు అందుకున్నారు. బాలికా వధూ(చిన్నారి పెళ్లికూతరు) సీరియల్ తో బుల్లి తెరపై కూడా తన నటనతో అలరించారు. ఈ సీరియల్ తో కళ్యాణి దేవిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఆమె.. తన నటనతో తెలుగులో కూడా అభిమానులను సంపాదించుకున్నారు.
2018లో షూటింగ్ సమయంలో బాత్రూంలో జారిపడటంతో సురేఖా సిక్రీకి బ్రెయిన్ స్ర్టోక్ వచ్చింది. కోలుకుంటున్న సమయంలోనే రెండేళ్ల తర్వాత మరోసారి బ్రెయిన్ స్ర్టోక్ రావడంతో ఆమె ఆరోగ్యం క్షీణిస్తూ వచ్చింది. అప్పటినుంచి నటనకు కాస్త బ్రేక్ ఇచ్చిన సురేఖా సిక్రీ.. చివరిసారిగా ఆంథాలజీ ఫిల్మ్ ఘోస్ట్ స్టోరీస్(2020) లో నటించారు.
![]() |
![]() |