![]() |
![]() |

కొవిడ్ సెకండ్ వేవ్ విజృంభణ అసాధారణ స్థాయిలో ఉంటోంది. వారూ వీరూ అనే తేడా లేకుండా సాధారణ ప్రజానీకంతో పాటు పలువురు సెలబ్రిటీలు కూడా దాని బారిన పడుతున్నారు. కొంతమంది వెంటనే కోలుకుంటుంటే, కొంతమంది చాలా రోజుల పాటు దాని వల్ల ఉత్పన్నమైన సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. మరికొంతమంది ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి.
లేటెస్ట్‌గా కొవిడ్-19 బారిన పడిన వారిలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చేరాడు. ఈ విషయాన్ని తన సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా వెల్లడించాడు. బుధవారం తన ట్విట్టర్ హ్యాండిల్‌లో ఓ నోట్‌ను పోస్ట్ చేశాడు బన్నీ. "హలో ఎవిరివన్! నాకు కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఇంటిలో స్వీయ ఐసోలేషన్‌లోకి వెళ్లాను. అన్ని నియమ నిబంధనలను పాటిస్తున్నాను. నన్ను కాంటాక్ట్ అయినవాళ్లంతా టెస్ట్ చేయించుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇంట్లో ఉండండి, క్షేమంగా ఉండడి. అవకాశం లభించిన వెంటనే వాక్సిన్ వేయించుకోండి. శ్రేయోభిలాషులను, అభిమానులను నా గురించి వర్రీ అవ్వద్దని కోరుతున్నాను. ప్రస్తుతం నేను కోలుకుంటున్నాను. ప్రేమతో.. అల్లు అర్జున్" అంటూ ఆ నోట్‌లో రాసుకొచ్చాడు బన్నీ.

ఇటీవలే ఆయన తండ్రి అల్లు అరవింద్ సైతం కొవిడ్ బారిన పడ్డారు. మొదటి విడత వాక్సిన్ వేయించుకున్న తర్వాత ఆయనకు కొవిడ్-19 అని నిర్ధారణ అయ్యింది. ఇటీవలి కాలంలో పవన్ కల్యాణ్, సోనూ సూద్, పూజా హెగ్డే లాంటి స్టార్లు కరోనాకు గురయ్యారు.
అల్లు అర్జున్‌కు కొవిడ్ పాజిటివ్‌గా తేలడంతో 'పుష్ప' షూటింగ్ అనివార్యంగా వాయిదాపడింది. ఆ సినిమా యూనిట్ మెంబర్స్‌లో ఇంకెంతమంది దీని బారిన పడ్డారో టెస్ట్ చేయించుకున్నాక వెల్లడవుతుంది.
![]() |
![]() |