![]() |
![]() |

సూపర్ స్టార్ మహేశ్ బాబు కెరీర్ లో ఎన్నో హిట్స్, సూపర్ హిట్స్, బ్లాక్ బస్టర్స్ ఉన్నాయి. అయితే, ఇండస్ట్రీ హిట్ మాత్రం ఇప్పటివరకైతే ఒకటే ఉంది. ఆ చిత్రమే.. `పోకిరి`. డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ రూపొందించిన ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ లో నెవర్ సీన్ బిఫోర్ రోల్, లుక్ తో కనిపించి తెలుగు ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు మహేశ్. పండుగాడు పాత్రలో ఒదిగిపోయారు. `ఎవడు కొడితే దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో ఆడే పండుగాడు`, `ఒకసారి కమిటైతే నా మాట నేనే వినను` వంటి పూరి మార్క్ డైలాగ్స్ ని తనదైన శైలిలో పలికి మురిపించారు. యాక్షన్ సీక్వెన్స్ లో అదరగొట్టారు. అలా.. మహేశ్ కెరీర్ లో మెమరబుల్ మూవీగా నిలిచిన `పోకిరి` విడుదలై నేటికి సరిగ్గా పదిహేనేళ్ళు. ఈ సందర్భంగా.. ఆ చిత్రానికి సంబంధించి కొన్ని ఆసక్తికరమైన విశేషాలు..
* మహేశ్ బాబు - పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో వచ్చిన మొదటి సినిమా ఇది. ఆ తరువాత ఈ ఇద్దరు `బిజినెస్ మేన్` (2012) కోసం జట్టుకట్టారు.
* మహేశ్ బాబు - ఇలియానా జంటగా నటించిన ఏకైక చిత్రమిది.
* పూరీ జగన్నాథ్- మెలోడీ బ్రహ్మ మణిశర్మ కాంబినేషన్ లో ఇదే ఫస్ట్ ఫిల్మ్. ఆపై `చిరుత`, `ఏక్ నిరంజన్`, `కెమెరామేన్ గంగతో రాంబాబు`, `ఇస్మార్ట్ శంకర్` చిత్రాలు వీరి కలయికలో వచ్చాయి.
* ముమైత్ ఖాన్ ని ఐటమ్ గాళ్ గా ఫుల్ బిజీ చేసిన సినిమా ఇదే.
* తమిళంలో `పోక్కిరి`, హిందీలో `వాంటెడ్`, కన్నడంలో `పోర్కి`, బెంగాలిలో `మోనేర్ జల` పేర్లతో `పోకిరి` రీమేక్ అయింది.
* `బెస్ట్ పాపులర్ ఫీచర్ ఫిల్మ్`, `బెస్ట్ ఎడిటర్` (మార్తాండ్ కె. వెంకటేశ్), `బెస్ట్ ఫైట్ మాస్టర్` (విజయన్), `బెస్ట్ మేల్ డబ్బింగ్ ఆర్టిస్ట్` (పి. రవిశంకర్) విభాగాల్లో `నంది` పురస్కారాలను.. `బెస్ట్ డైరెక్టర్`, `బెస్ట్ యాక్టర్` విభాగాల్లో `ఫిల్మ్ ఫేర్` అవార్డులను పొందిందీ సినిమా.
![]() |
![]() |