![]() |
![]() |
-a.jpg)
టాలీవుడ్ అగ్రతారల్లో ఒకరైన సమంత అక్కినేని ఈరోజు 34వ పుట్టినరోజు జరుపుకుంటోంది. ఉదయం నుంచి ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఫ్యాన్స్, ఫ్రెండ్స్ సోషల్ మీడియాను ముంచెత్తుతున్నారు. కరోనా సెకండ్ వేవ్ బీభత్సంగా ఉండటంతో తన పుట్టినరోజున ఎక్కడికీ కదలకుండా ఇంట్లోనే భర్త నాగచైతన్య, తన పెంపుడు కుక్క హ్యాష్‌తో గడపాలని డిసైడ్ చేసుకుంది సమంత.
తన అందచందాలు, అభినయం, సోషల్ వర్క్, సోషల్ మీడియాలో పెట్టే పోస్టులతో నిత్యం వార్తల్లో నిలుస్తూ ఉంటుందామె. నాగచైతన్య ఆమెకు పూర్తి భిన్నం. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండడు. బయట కూడా రిజర్వ్‌డ్‌గానే కనిపిస్తుంటాడు. సమంత కేవలం నటి మాత్రమే కాదు, వ్యాపారవేత్త కూడా. ఇటీవలే ఆమె 'సాకి' అనే ఫ్యాషన్ లేబుల్‌ను స్టార్ట్ చేసింది. అంతే కాదు, ఈ ఏడాది మొదట్లో హైదరాబాద్‌లో 'ఏకం' అనే ప్రి-స్కూల్‌ను స్టార్ట్ చేసింది.
.jpg)
ఒక అంచనా ప్రకారం సమంత దగ్గరున్న నికర ఆస్తుల విలువ రూ. 84 కోట్లయితే, నాగచైతన్య నికర ఆస్తుల విలువ రూ. 38 కోట్లు. అంటే ఇద్దరి ఆస్తులు కలిపితే రూ. 122 కోట్లు. సినిమాల్లో నటించడం ద్వారా, వ్యాపారాల ద్వారానే కాకుండా మోడల్‌గా కూడా సంపాదిస్తోంది సమంత. మింత్ర, డ్రూల్స్, ఏరియల్, హిటాచి లాంటి బ్రాండ్లను ఎండార్స్ చేయడం ద్వారా కూడా ఆమె డబ్బు గడిస్తోంది.
ప్రస్తుతం ఆమె తెలుగులో గుణశేఖర్ డైరెక్షన్‌లో 'శాకుంతలం' మూవీతో పాటు తమిళంలో నయనతారతో స్క్రీన్ పంచుకుంటూ కాదు వాకుల రెండు కాదల్ మూవీని చేస్తోంది. మనోజ్ బాజ్‌పేయితో కలిసి ఆమె నటించిన వెబ్ సిరీస్ 'ద ఫ్యామిలీ మ్యాన్ 2' త్వరలో ఓటీటీలో స్ట్రీమ్ కానున్నది.
.jpg)
![]() |
![]() |