![]() |
![]() |

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య చేసుకోలేదని, ఎవరో హత్య చేశారని అతడి మేనమామతో పాటు బీహార్ రాజకీయ నాయకులు పప్పు యాదవ్ ఆరోపించారు. సుశాంత్ మృతిపై సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అయితే, పోస్టుమార్టం నిర్వహించిన వైద్యులు ఆత్మహత్య అని తేల్చారు.
ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం సుశాంత్ కి ఏమొచ్చింది? అర్ధాంతరంగా ఎందుకు తనువు చాలించాడు? సమాధానాలు దొరకని ప్రశ్నలే. అయితే, బాలీవుడ్ ఇండస్ట్రీ లో కొందరి వాదన మరోలా ఉంది. బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థల కారణంగానే సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య చేసుకున్నాడని కొందరు చెబుతున్నారు.
ప్రముఖ దర్శక నిర్మాత ఆదిత్య చోప్రా కి చెందిన యష్ రాజ్ ఫిలిమ్స్, కరణ్ జోహార్ కి చెందిన ధర్మ ప్రొడక్షన్స్, సుశాంత్ ను బుల్లి తెరకు పరిచయం చేసిన ప్రముఖ మహిళా నిర్మాత ఏక్తా కపూర్ కి చెందిన బాలాజీ ఫిలిమ్స్ వంటి ప్రముఖ నిర్మాణ సంస్థలు సహా మరికొన్ని నిర్మాణ సంస్థలు అతడిపై అనధికారిక నిషేధం విధించాయట. తాము తీసే సినిమాల్లో కి సుశాంత్ ను తీసుకోకూడదని నిర్ణయించుకున్నాయట.
యష్ రాజ్ ఫిలిమ్స్ ఓ సినిమాలో నటించమని అడగ్గా... అది కాదని శేఖర్ కపూర్ దర్శకత్వంలో 'పాని' సినిమా చేయాలని సుశాంత్ నిర్ణయించుకోవడంతో అతడిపై బడా నిర్మాణ సంస్థలు కక్ష కట్టాయని ముంబై గుసగుస. ఎటువంటి సినీ నేపథ్యం లేకపోవడంతో అతన్ని తొక్కేశారని టాక్. 'నువ్వు అనుభవించిన బాధ ఏంటో నాకు తెలుసు. ఇది నీ కర్మ కాదు వాళ్ళ కర్మ' అని శేఖర్ కపూర్ ట్వీట్ చేయడం ఈ వాదనలకు బలం చేకూరుస్తోంది.
![]() |
![]() |