![]() |
![]() |

బాలీవుడ్‌లో ప్రస్తుతం అత్యధికంగా సంపాదిస్తున్న నటుడెవరో తెలుసా? అక్షయ్‌కుమార్!. 2020 ఫోర్బ్స్ హయ్యెస్ట్ పెయిడ్ యాక్టర్స్ లిస్ట్‌లో చోటు పొందిన ఏకైక భారతీయ నటుడు అక్షయ్. 2019లో బ్యాక్ టు బ్యాక్ హిట్స్‌తో ఆయన ఈ ఘనతను సాధించాడు. ఇవాళ ఇండియాలో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న నటుల్లో ఆయన ఒకరు. రెమ్యూనరేషన్‌గా సినిమాకు ఆయన ఎంత తీసుకుంటున్నాడనే విషయం తెలుసుకోవాలని చాలామంది కుతూహలం వ్యక్తం చేస్తుంటారు. ఫిల్మ్‌ఫేర్ ప్రకారం రానున్న సినిమాలకు ఆయన తన రెమ్యూనరేషన్‌ను మరోసారి పెంచేశాడు. ఆయనకు ఇచ్చే పారితోషికంతో టాలీవుడ్‌లో రెండు భారీ బడ్జెట్ సినిమాలను నిర్మించవచ్చు!
గత ఏడాది ఆయన సినిమాక రూ. 120 కోట్లు తీసుకున్నాడు. ఆయన రెమ్యూనరేషన్ తీసేస్తే 'అత్రంగి రే' బడ్జెట్ రూ. 40 కోట్ల నుంచి రూ. 45 కోట్ల మధ్యలో ఉంటుంది. అందుకని నిర్మాతలు రెమ్యూనరేషన్‌గా డిజిటల్, శాటిలైట్ హక్కులు ఆయనకు రాసిచ్చేశారు. ఈ మూవీలో ధనుష్, సారా అలీఖాన్ కూడా ప్రధాన పాత్రధారులు. అక్షయ్ మినిమమ్ గ్యారంటీ స్టార్‌గా పేరు తెచ్చుకున్నాడు. ఆయన ఉంటే థియేటర్లకు ప్రేక్షకులు తరలి వస్తుంటారు. పైగా డిజిటల్, శాటిలైట్ రైట్స్ కూడా భారీ రేట్లు పలుకుతున్నాయి. అందుకే ఆయనకు రూ. 100 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ ఇవ్వడంలో తప్పేమీ లేదని ఆయన టీమ్ అంటోంది.
ఫిల్మ్‌ఫేర్ రిపోర్ట్ చేసిన దాని ప్రకారం ఇప్పుడు అక్షయ్‌తో సినిమా తియ్యాలనుకునేవాళ్లు రూ. 135 కోట్లు సమర్పించుకోవాల్సిందే. రిటర్న్స్ భారీ స్థాయిలో ఉండటం, రిస్క్ తక్కువ కావడం వల్లే నిర్మాతలు ఆయన వెనుక పడుతున్నారు. ఆయన నటించగా గత ఏడాది రావాల్సిన 'సూర్యవంశీ' 2021లో రిలీజవుతోంది. ఆపైన అత్రంగి రే, బెల్ బాటమ్, రక్షా బంధన్, పృథ్వీరాజ్, బచ్చన్ పాండే, రామ్ సేతు సినిమాలు ఒకదాని తర్వాత ఒకటిగా ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఇన్ని సినిమాలు లైన్‌లో ఉండటం చూస్తే.. రెమ్యూనరేషన్‌తో నిమిత్తం లేకుండా అక్షయ్ డిమాండ్ ఏ రేంజ్‌లో ఉందో అర్థమైపోతోంది.
![]() |
![]() |