![]() |
![]() |

ఎలాంటి పాత్రలోనైనా ఒదిగిపోయే నటుల్లో రానా దగ్గుబాటి ఒకరు. ఒకవైపు కథానాయకుడిగా నటిస్తూనే.. మరోవైపు ప్రతినాయకుడిగానూ అలరిస్తారు. ఇంకోవైపు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానూ దర్శనమిస్తారు. అలాంటి రానా.. 2021లో పలు మల్టిస్టారర్స్ తో బిజీ కాబోతున్నారు.
ఆ వివరాల్లోకి వెళితే.. ఇటీవలే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో అయ్యప్పనుమ్ కోషియుమ్ రీమేక్ ని షురూ చేసిన రానా.. త్వరలో దగ్గుబాటి వారి మల్టిస్టారర్ ని సెట్స్ పైకి తీసుకెళ్ళనున్నారు. ఇందులో తన బాబాయ్, విక్టరీ వెంకటేష్ తో పాటు అక్కినేని నాగచైతన్యతోనూ స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నట్లు సమాచారం. అంతేకాదు.. తాజాగా యంగ్ హీరో విశ్వక్ సేన్ కాంబినేషన్ లోనూ రానా ఓ మల్టిస్టారర్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్. ఈ చిత్రాన్ని కూడా సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించనుందట. త్వరలోనే దీనికి సంబంధించి మరింత సమాచారం వెలువడే అవకాశముంది. మొత్తమ్మీద.. 2021లో రానా పలు మల్టిస్టారర్స్ షూటింగ్స్ తో బిజీ కాబోతున్నారన్నమాట.
![]() |
![]() |