![]() |
![]() |

ఎస్.ఎస్. పట్నాయక్ రచన చేస్తూ, దర్శకత్వం వహిస్తోన్న చిత్రం 'పద్మశ్రీ'. ఎస్.ఎస్. పిక్చర్స్ పతాకంపై సదాశివుని శిరీష నిర్మిస్తున్న ఈ చిత్రానికి పీవీఎస్ రామ్మోహన్ రావు, మామిడి సాంబమూర్తి, కొత్తకోట బాలకృష్ణ సహ నిర్మాతలు. నూతన సంవత్సరం ఆరంభం సందర్భంగా పద్మశ్రీ ఫిల్మ్ ఫస్ట్ లుక్‌ను రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు ఆవిష్కరించారు. జనవరి 1 ఉదయం ఆయన కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో డైరెక్టర్ ఎస్.ఎస్. పట్నాయక్, ఫైనాన్షియల్ అడ్వైజర్ హారిక, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ పీవీజీ కృష్ణంరాజు, కొరియోగ్రాఫర్ తారక్, స్థానిక కళాకారుడు గోకవలస కృష్ణమూర్తి, సినీ దర్శకుడు శ్రీకరబాబు పాల్గొన్నారు.
'పద్మశ్రీ' షూటింగ్‌లో కొంత భాగాన్ని హైదరాబాద్, ఆలంపూర్‌లో జరపగా, అత్యధిక భాగం తృప్తి రిసార్ట్స్‌లోని అందమైన ప్రదేశాల్లో జరిపారు. అంతా కొత్తవారితో రూపొందిస్తోన్న ఈ కామెడీ ఓరియెంటెడ్ యాక్షన్ హారర్ మూవీకి తృప్తి రిస్టార్ట్స్‌లో చిత్రీకరించిన సన్నివేశాలు ఎస్సెట్ అవుతాయని డైరెక్టర్ పట్నాయక్ చెప్పారు. అలాగే ఈ చిత్రంలో గ్రాఫిక్స్‌కు కూడా ప్రాధాన్యం ఉందని తెలిపారు.
ఎమ్మెల్యే కంబాల జోగులు మాట్లాడుతూ, తన నియోజకవర్గం లోనే ఉన్న తృప్తి రిసార్ట్స్ లో చిత్ర అధిక భాగం షూటింగ్ జరగడం, తృప్తి రిసార్ట్స్ సినిమా స్టూడియోగా మార్పు చెందుతూ, స్థానికులను సినిమా ఫీల్డ్ వారిగా మార్చడం తనకు చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ సందర్భంగా పద్మశ్రీ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ పీవీజీ కృష్ణంరాజును అభినందించారు.
ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: మేకల నర్సింగరావు, ఆర్ట్: మణిపాత్రుని నాగేశ్వరరావు, ఫైట్స్: దేవరాజు మాస్టర్, సంగీతం: జాన్ పోట్ల, ఎడిటింగ్: కంబాల శ్రీనివాసరావు.

![]() |
![]() |