![]() |
![]() |

మెగాస్టార్ చిరంజీవి, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో వస్తున్న మల్టిస్టారర్ మూవీ ఆచార్య. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ రూపొందిస్తున్న ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్.. ప్రస్తుతం హైదరాబాద్ నగర శివారులోని కోకపేటలో జరుగుతోంది. అక్కడ వేసిన స్పెషల్ టెంపుల్ టౌన్ లో కొన్ని కీలక దృశ్యాలను చిత్రీకరిస్తున్నారు. దాదాపు 20 ఎకరాల్లో ఈ సెట్ ని నిర్మించడం విశేషం. ఇండియాలో అన్ని ఎకరాల్లో ఓ సినిమా కోసం అంత భారీ సెట్ వేయడం ఇదే మొదటిసారి కావడం వార్తల్లో నిలుస్తోంది. ఆ రకంగా.. ఇదో స్పెషల్ రికార్డ్ అనే చెప్పాలి.
కాగా, ఈ నెల 10 వరకు చిరంజీవి తదితరులపై ఇక్కడ షూటింగ్ జరుగనుంది. ఆపై చరణ్ కాంబినేషన్ లో కొన్ని సన్నివేశాల్లో పాల్గొననున్నారు చిరు. సుమారు 30 రోజుల పాటు చెర్రీ పాత్రకి సంబంధించిన షూటింగ్ ఉంటుందని సమాచారం. అలాగే చిరు, చరణ్ పై ఓ పాట కూడా ఉంటుందని వినికిడి.
మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతమందిస్తున్న ఆచార్య మే 7న విడుదల కానుందని ప్రచారం సాగుతోంది.
![]() |
![]() |