![]() |
![]() |

మహానటి ఫేమ్ కీర్తి సురేష్ కి 2021 వేసవి ఎంతో ప్రత్యేకం కానుంది. ఎందుకంటే.. ఈ సమ్మర్ సీజన్ లో ఒకే రోజున ఆమె నటించిన రెండు చిత్రాలు విడుదల కాబోతున్నాయి.
ఆ వివరాల్లోకి వెళితే.. యువ కథానాయకుడు నితిన్ కి జంటగా కీర్తి సురేష్ నటించిన రొమాంటిక్ ఎంటర్ టైనర్ రంగ్ దే. తొలి ప్రేమ ఫేమ్ వెంకీ అట్లూరి రూపొందించిన ఈ చిత్రం మార్చి 26న విడుదల కాబోతున్నట్లు యూనిట్ ప్రకటించింది. కట్ చేస్తే.. ఇప్పుడు అదే రోజున ఆమె నటించిన మలయాళ సినిమా మరక్కార్ అరబిక్కడలింటే సింహం కూడా రిలీజ్ కాబోతోంది. మాలీవుడ్ సూపర్ స్టార్ మోహన్ లాల్ ప్రధాన పాత్రలో అగ్ర దర్శకుడు ప్రియదర్శన్ రూపొందించిన ఈ హిస్టారికల్ ఎపిక్ వార్ డ్రామాలో కీర్తి ఓ కీలక పాత్రలో అభినయించింది.
మరి.. ఒకే రోజున విడుదల కాబోతున్న ఈ విభిన్న కథాంశ చిత్రాలు, విభిన్న భాషా చిత్రాలు కీర్తి సురేష్ కి ఎలాంటి గుర్తింపుని, ఫలితాలను అందిస్తాయో చూడాలి.
![]() |
![]() |