![]() |
![]() |

మలయాళంలో ఘనవిజయం సాధించిన లూసీఫర్ చిత్రం.. తెలుగులో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని కోలీవుడ్ స్టార్ కెప్టెన్ మోహన్ రాజా డైరెక్ట్ చేస్తున్నారు. హనుమాన్ జంక్షన్ (2001) తరువాత సుదీర్ఘ విరామం తీసుకుని రాజా రూపొందిస్తున్న తెలుగు చిత్రమిదే కావడం విశేషం. తెలుగు నేటివిటికి తగ్గట్టు మార్పుచేర్పులతో ఈ సినిమాని తీర్చిదిద్దనున్నారు. ఈ నెలలోనే పట్టాలెక్కనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని చకచకా పూర్తి చేసి.. ఈ సంవత్సరం ద్వితీయార్ధంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో టాలెంటెడ్ యాక్టర్ సత్యదేవ్ ఓ కీలక పాత్రలో నటించబోతున్నట్లు కథనాలు వినిపిస్తున్నాయి. ఒరిజినల్ లో వివేక్ ఒబెరాయ్ పోషించిన పాత్రలోనా లేదంటే యంగ్ సీఎమ్ క్యారెక్టర్ లోనా అన్నదానిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఏదీఏమైనా.. చిరు వీరాభిమాని అయిన సత్యదేవ్ కి ఇప్పుడు తనతో కలసి నటించే అవకాశం దక్కడం వార్తల్లో నిలుస్తోంది. త్వరలోనే లూసీఫర్ రీమేక్ లో సత్యదేవ్ ఎంట్రీపై క్లారిటీ వస్తుంది.
![]() |
![]() |