![]() |
![]() |
.jpg)
మెస్మరైజింగ్ బ్యూటీ నదియా 1988లో ఎ. కోదండరామిరెడ్డి డైరెక్ట్ చేయగా, రమేశ్‌బాబు సరసన నటించిన 'బజారు రౌడీ' సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. అప్పటికే ఆమె తమిళ ప్రేక్షకుల ఆరాధ్య తార. రజనీకాంత్, విజయ్‌కాంత్, సత్యరాజ్, ప్రభు లాంటి స్టార్స్ సరసన నటించిన ఆమె లక్షలాది మంది యువత హృదయాలను బద్దలుచేస్తూ 1988లోనే శిరీష్ గాడ్‌బోలే అనే వ్యాపారవేత్తను పెళ్లాడేసింది. అప్పటికి ఆమె కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉంది. తెలుగులో 'బజారు రౌడీ' తర్వాత రాజశేఖర్‌తో 'వింత దొంగలు' సినిమా చేసే టైమ్‌లోనే ఆమె మ్యారేజ్ అయ్యింది. ఆ తర్వాత ఆమె భర్తతో కలిసి లండన్ వెళ్లిపోయారు. ఆ ఇద్దరికీ ఇద్దరు కూతుళ్లు.. 1996లో సనమ్, 2001లో జానా పుట్టారు. ఆ తర్వాత ఆమె ఫ్యామిలీతో కలిసి ముంబైకి వచ్చేసి స్థిరపడ్డారు.
2004లో జయం రవి తల్లిగా 'ఎం. కుమరన్ సన్నాఫ్ మహాలక్ష్మి' (అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి) తమిళ మూవీతో ఆమె సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. తెలుగులో ప్రభాస్ తల్లిగా 'మిర్చి'తో రిఎంట్రీ ఇచ్చి తన క్యూట్ లుక్స్‌తో ప్రేక్షకుల్ని మళ్లీ సమ్మోహితుల్ని చేశారు. 'అత్తారింటికి దారేది' చిత్రంలో పవన్ కల్యాణ్ మేనత్తగా ఆమె ఎంతగా ఆకట్టుకున్నారో తెలిసిందే.
.jpg)
సౌత్‌లో ఇటు తెలుగు, అటు తమిళ సినిమాలతో బిజీగా మారడంతో నదియా తన మాకాంను చెన్నైకు షిఫ్ట్ చేశారు. ఇన్‌స్టాగ్రామ్‌లో తనకు సంబంధించిన ఫొటోలతో పాటు, సందర్భం వచ్చినప్పుడల్లా తను నటించిన సినిమాలకు సంబంధించిన ఫొటోలను షేర్ చేస్తూ, వాటిని గుర్తు చేసుకుంటున్నారు. కొంతకాలం క్రితం తన ఇద్దరు కూతుళ్లు సనమ్, జానాలతో కలిసి తీయించుకున్న ఫొటోలు వైరల్ అయ్యాయి. వాళ్లకు ఆమె అమ్మలాగా లేదనీ అక్కలాగా ఉందనీ ఫ్యాన్స్ కామెంట్ చేశారు. భర్త, ఇద్దరు పిల్లలతో ఫ్యామిలీ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తున్న నదియా వయసెంతనుకున్నారు.. 54 సంవత్సరాలు. ఆమె అసలు పేరు జరీనా మొయిదు.
.jpg)
![]() |
![]() |