![]() |
![]() |

మలయాళ 'ప్రేమమ్' మూవీతో వెండితెరకు పరిచయమైన అనుపమ పరమేశ్వరన్ మొదటి సినిమాతోనే కుర్రకారు గుండెల్ని కొల్లగొట్టింది. ఆ తరువాత తెలుగు, మలయాళం, తమిళ్ భాషల్లో వరుస సినిమాలు చేస్తూ బిజీ నటిగా మారిపోయింది. అందం, అభినయంతో ఎందరికో కలలరాణిలా మారిన అనుపమ.. గతంలో ఒక వ్యక్తిని గాఢంగా ప్రేమించానంటూ తాజాగా తన లవ్ స్టొరీని బయటపెట్టింది.
సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే అనుపమ.. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో నెటిజనులతో ముచ్చటించింది. ఈ సందర్భంగా వారు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానమిచ్చింది. మీ జీవితంలో నిజమైన ప్రేమ ఉందా? అంటూ ఓ నెటిజన్ అడగ్గా.. గతంలో ఓ వ్యక్తిని గాఢంగా ప్రేమించానని అనుపమ తెలిపింది. అతన్ని ఎంతో ఇష్టపడ్డానని.. కానీ కొన్ని కారణాల వల్ల బ్రేకప్ అయిపోయిందని చెప్పుకొచ్చింది. అయితే ఆ వ్యక్తి వివరాలు మాత్రం వెల్లడించలేదు అనుపమ.
కాగా, గతంలో క్రికెటర్ బుమ్రాతో అనుపమ ప్రేమలో ఉందన్న వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే బుమ్రా టీవీ యాంకర్ సంజనను పెళ్లాడటం.. ఆ తర్వాత అనుపమ సాడ్ సాంగ్స్‌తో వీడియోలు చేయడం అప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. తాజాగా అనుపమ బ్రేకప్ విషయం బయటపెట్టడంతో మరోసారి బుమ్రా పేరు తెరపైకి వచ్చింది. అనుపమ గాఢంగా ప్రేమించిన వ్యక్తి బుమ్రా అయ్యుంటాడని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.
![]() |
![]() |