![]() |
![]() |

సినీ విమర్శకుడు, నటుడు, దర్శకుడు కత్తి మహేష్ కన్ను మూశారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆయన చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం తుది శ్వాస విడిచారు.
గత నెల 26న నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం చంద్రశేఖరపురం వద్ద జాతీయ రహదారిపై యాక్సిడెంట్ జరగడంతో కత్తి మహేష్ తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో ఆయన తల, ముక్కు, కళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆయనను నెల్లూరులోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం చెన్నై అపోలోకి తరలించారు. ఆయన కోలుకుంటున్నట్లుగా ఇటీవల వార్తలు వచ్చాయి. ఇప్పుడు అకస్మాత్తుగా ఆయన మరణవార్త రావడం బాధాకరం.
ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ కి అత్యంత సన్నిహితుడని పేరు పొందారు కత్తి మహేష్. యాక్సిడెంట్ తర్వాత ఆయన చికిత్స కోసం జగన్ సర్కార్.. సీఎం రిలీఫ్ ఫండ్ కింద రూ. 17 లక్షల భారీ ఆర్థిక సాయం ప్రకటించింది. నిపుణుల డాక్టర్లు బృందం చికిత్స అందించినా.. ప్రభుత్వం ఆర్థికంగా అండగా నిలిచినా ఆయన ప్రాణాలు దక్కలేదు.
![]() |
![]() |