![]() |
![]() |

నట దిగ్గజం కమల్ హాసన్ నటిస్తున్న తాజా చిత్రం 'విక్రమ్'. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమాకు లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ టీజర్ ను విడుదల చేయగా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేసింది చిత్రయూనిట్.
'విక్రమ్' మూవీలో విజయ్ సేతుపతి, మలయాళ నటుడు ఫవాద్ ఫాజిల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్ లో.. కమల్, విజయ్, ఫాజిల్ ల రఫ్ లుక్ ఆకట్టుకుంటోంది. ఖైదీ, మాస్టర్ సినిమాలతో ఆకట్టుకున్న లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా కావడంతో.. విక్రమ్ మూవీపై మంచి అంచనాలే ఉన్నాయి. తాజాగా విడుదలైన పోస్టర్ ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచింది.

కమల్ సొంత నిర్మాణ సంస్థ 'రాజ్ కమల్ ఇంటర్నేషనల్ ఫిలింస్' బ్యానర్ పై ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమా షూటింగ్ కరోనా సెకండ్ వేవ్ కారణంగా నిలిచిపోయింది. ఇటీవలే పరిస్థితులు మెరుగవడంతో మళ్లీ షూటింగ్ మొదలైంది. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు.
![]() |
![]() |