![]() |
![]() |

తెలుగు ఓటీటీ మాధ్యమం 'ఆహా' పలు షోలతో అలరిస్తోన్న సంగతి తెలిసిందే. సామ్ జామ్, నెంబర్ వన్ యారి వంటి టాక్ షోలతో ఆకట్టుకుంటున్న ఆహా.. తాజాగా 'ఆహా భోజనంబు' అంటూ మరో టాక్ షోతో ప్రేక్షకులను మెప్పించడానికి సిద్ధమైంది. ఈ షోకి నటి, నిర్మాత లక్ష్మీ మంచు హోస్ట్ గా వ్యవహరించనున్నారు. ఈ షోకి అతిథులుగా వచ్చే టాలీవుడ్ సెలబ్రిటీలు రుచికరమైన వంటకాలను వండుతూ.. వంటలపై తమకున్న ప్రేమను తెలియజేస్తూనే.. వివిధ సంగతులను పంచుకుంటారు.
'ఆహా భోజనంబు' షోలో పాల్గొనే సెలబ్రిటీలు ఆహారంతో వారికున్న మంచి జ్ఞాపకాలను తెలియజేస్తూనే సరదాగా సంభాషణ చేస్తారు. వంటకు సంబంధించిన కోణంలో సరదాగా సాగే 'ఆహా భోజనంబు' కార్యక్రమం టాక్ షోలలో కొత్త ఫార్మాట్ అనే చెప్పాలి. రకుల్ ప్రీత్ సింగ్, తరుణ్ భాస్కర్, విష్ణు మంచు, అఖిల్ అక్కినేని, ప్రకాష్ రాజ్, ఆనంద్ దేవరకొండ, రానా దగ్గుబాటి, విష్వక్‌సేన్ వంటి స్టార్స్ ఈ షోలో పాల్గొనబోతున్నారని సమాచారం.
కాగా, గతంలో పలు టాక్ షోలతో మెప్పించిన లక్ష్మీ మంచు.. 'ఆహా భోజనంబు'తో మరోసారి మెప్పిస్తారనడంలో సందేహం లేదు.
![]() |
![]() |