Home

»

Latest News

చిరంజీవి `చ‌క్ర‌వ‌ర్తి`కి 35 ఏళ్ళు!

Jun 4, 2022 2:23PM

రీమేక్ మూవీస్ కి కేరాఫ్ అడ్ర‌స్ గా నిలిచిన ద‌ర్శ‌కుల్లో ర‌విరాజా పినిశెట్టి ఒక‌రు. త‌న ల‌క్కీ హీరోల్లో ఒక‌రైన మెగాస్టార్ చిరంజీవితో ర‌విరాజా పినిశెట్టి తెర‌కెక్కించిన `చ‌క్ర‌వ‌ర్తి` కూడా ఓ రీమేక్ నే.  1972 నాటి త‌మిళ చిత్రం `జ్ఞాన ఓళి` (శివాజీ గ‌ణేశ‌న్, విజ‌య నిర్మ‌ల‌, శార‌ద‌) ఆధారంగా రూపొందిన ఈ సినిమాలో అంజిగా, చ‌క్ర‌వ‌ర్తిగా రెండు ఛాయ‌లున్న పాత్ర‌లో ఆక‌ట్టుకున్నారు చిరు. క‌లెక్ష‌న్ కింగ్ మోహ‌న్ బాబు మ‌రో ముఖ్య పాత్ర‌లో న‌టించిన ఈ సినిమాలో చిరుకి జోడీగా భానుప్రియ ఎంటర్టైన్ చేయ‌గా.. చిరు చెల్లెలుగా ర‌మ్య‌కృష్ణ ద‌ర్శ‌న‌మిచ్చారు. జేవీ సోమ‌యాజులు,  బ్ర‌హ్మానందం, కైకాల స‌త్య‌నారాయ‌ణ ఇత‌ర ముఖ్య పాత్ర‌ల్లో అల‌రించారు.

చ‌క్ర‌వ‌ర్తి బాణీలు క‌ట్టిన ఈ చిత్రానికి వేటూరి సుంద‌ర‌రామ్మూర్తి, `సిరివెన్నెల‌` సీతారామ‌శాస్త్రి సాహిత్య‌మందించారు. ``వ‌న్నెల రాణి కిన్నెర‌సాని``, ``ఊపిరి నిండా సాహ‌స‌మే``, ``సందిట్లో చిక్కింద‌మ్మా జాబిలి``, ``మొక్క‌జొన్న తోట కాడ‌``, ``ఏరు జోల పాడెన‌య్యా సామి``, ``మ‌బ్బులు విడివ‌డిపోయే``, ``ఏరు దాటిపోవ‌ద్ద‌య్యా సామి`` అంటూ మొద‌ల‌య్యే పాట‌ల‌న్నీ ఆక‌ట్టుకున్నాయి. కాగా, కొడాలి వెంక‌టేశ్వ‌ర రావు నిర్మించిన `చ‌క్ర‌వ‌ర్తి`.. 1987 జూన్ 4న విడుద‌లై జ‌న‌నీరాజ‌నాలు అందుకుంది. నేటితో ఈ చిత్రం 35 వ‌సంతాలు చేసుకుంది.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com