![]() |
![]() |

ఫీల్ గుడ్ రొమాంటిక్ ఎంటర్టైనర్స్ కి పెట్టింది పేరు.. దర్శకుడు ఎ. కరుణాకరన్. ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా కాంబినేషన్ లో కరుణాకరన్ రూపొందించిన `ఎందుకంటే.. ప్రేమంట!` కూడా ఆ కోవకు చెందిన సినిమానే. అమెరికన్ ఫిల్మ్ `జస్ట్ లైక్ హెవెన్` (2005) ఆధారంగా తెరకెక్కిన ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ లో రెండు విభిన్న కాలాలకు చెందిన ప్రేమికులుగా ద్విపాత్రాభినయం చేశారు రామ్, తమన్నా.
సుమన్, అను హాసన్, రిషి, సాయాజీ షిండే, వై. కాశీ విశ్వనాథ్, కోన వెంకట్, బ్రహ్మానందం, సత్య కృష్ణన్, నాగినీడు, రఘుబాబు, సుమన్ శెట్టి ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమిచ్చిన ఈ చిత్రానికి ఐ. ఆండ్రూ అందించిన ఛాయాగ్రహణం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతమందించిన `ఎందుకంటే.. ప్రేమంట!`కి రామజోగయ్య శాస్త్రి, శ్రీమణి సాహిత్యమందించారు. ``నీ చూపులే``, ``సిండ్రెల్లా``, ``ఎగిరి పోవే``, ``కిక్కో గిక్కో``, ``చిల్ ఔట్``.. ఇలా ఇందులోని పాటలన్నీ యువతరాన్ని ఆకట్టుకున్నాయి. శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై స్రవంతి రవి కిశోర్ నిర్మించిన `ఎందుకంటే.. ప్రేమంట!`.. నేటితో పది వసంతాలు పూర్తిచేసుకుంది.
![]() |
![]() |