![]() |
![]() |

నయనతార, పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలు పోషిస్తోన్న మలయాళం ఫిల్మ్ 'గోల్డ్' ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ప్రేమమ్ ఫేమ్ అల్ఫాన్స్ పుత్రేన్ ఈ మూవీని యాక్షన్ కామెడీగా రూపొందిస్తున్నాడు. దర్శకత్వం వహించడంతో పాటు ఈ సినిమాకు రచయితగా, ఎడిటర్‌గా కూడా కూడా అతను పనిచేస్తున్నాడు. పోస్టర్‌లో పృథ్వీరాజ్ ఎవరితోనో ఫోన్‌లో మాట్లాడుతుండగా, నయనతార ఆశ్చర్యంగా చూస్తూ కనిపిస్తోంది. ఈ కలర్‌ఫుల్ పోస్టర్‌లో మిగతా ఆర్టిస్టులు కూడా పోస్టర్ చుట్టూ కనిపిస్తున్నారు.
సుప్రియా మీనన్, లిస్టిన్ స్టీఫెన్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ మూవీలో అజ్మల్ అమీర్, కృష్ణ శంకర్, శబరీష్ వర్మ, చెంబన్ వినోద్ జోస్, వినయ్ ఫోర్ట్, రోషన్ మాథ్యూ, మల్లికా సుకుమారన్, దీప్తి సతి, జగదీశ్ తదితర అనేకమంది తారలు నటిస్తున్నారు. 2015లో విడుదలై ఇటు ప్రేక్షకుల, అటు విమర్శకుల విశేష ఆదరణకు నోచుకున్న 'ప్రేమమ్' తర్వాత అల్ఫాన్స్ పుత్రేన్ రూపొందిస్తోన్న సినిమా ఇదే.
నయనతార మలయాళంలో ఫహద్ ఫాజిల్‌తో కలిసి 'పట్టు', తెలుగులో చిరంజీవితో కలిసి 'గాడ్‌ఫాదర్' సినిమాలు చేస్తోంది. హిందీలో అట్లీ డైరెక్షన్‌లో షారుక్ ఖాన్ జోడీగా 'జవాన్' మూవీలో నటించేందుకు రెడీ అవుతోంది. ఈలోగా జూన్ 9న తన సుదీర్ఘ కాల బాయ్‌ఫ్రెండ్ విఘ్నేశ్ శివన్‌ను పెళ్లాడుతోంది.

![]() |
![]() |