![]() |
![]() |

యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా 'విక్రమ్'. 'ఖైదీ', 'మాస్టర్' వంటి సినిమాల తర్వాత కమల్ తో లోకేష్ చేస్తున్న సినిమా కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. పైగా ఈ సినిమాలో విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాజిల్ నటిస్తుండటంతో ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి ఏర్పడింది. తాజాగా విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది.
'విక్రమ్' ట్రైలర్ ను ఆదివారం సాయంత్రం విడుదల చేశారు. అడవిలోని మృగాలు, ప్రకృతితో పోలుస్తూ ట్రైలర్ లో విక్రమ్ ను పవర్ ఫుల్ గా పరిచయం చేశారు. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీ ట్రైలర్.. డార్క్ థీమ్, భారీ యాక్షన్ సీన్స్ తో ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. విక్రమ్ గా కమల్ పాత్ర ఎంత పవర్ ఫుల్ గా ఉందో.. విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాజిల్ పాత్రలు కూడా అంతే పవర్ ఫుల్ గా కనిపిస్తున్నాయి. ఇక అనిరుధ్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ట్రైలర్ కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
రాజ్ కమల్ ఫిలిమ్స్ నిర్మిస్తున్న 'విక్రమ్' మూవీ జూన్ 3 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ట్రైలర్ చూస్తుంటే యాక్షన్ ప్రియులను మెప్పించేలా ఉంది. మరి ఈ సినిమా ఏ స్థాయిలో అలరిస్తుందో చూడాలి.
![]() |
![]() |