![]() |
![]() |

ఈ ఏడాది సంక్రాంతికి `బంగార్రాజు`గా పలకరించాడు యువ సామ్రాట్ నాగచైతన్య. తన తండ్రి, కింగ్ నాగార్జునతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్న ఈ విలేజ్ డ్రామా.. చైతూ ఖాతాలో మరో విజయాన్ని జమ చేసింది. కట్ చేస్తే.. త్వరలో ఈ యంగ్ హీరో రెండు సినిమాలతో ఎంటర్టైన్ చేయనున్నాడు. ఆ చిత్రాలే.. `థాంక్ యూ`, `లాల్ సింగ్ చద్ధా`. నాగచైతన్య సోలో హీరోగా నటించిన `థాంక్ యూ` జూలై 8న విడుదల కానుండగా.. మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ తో కలిసి చైతూ నటించిన బాలీవుడ్ ప్రాజెక్ట్ `లాల్ సింగ్ చద్ధా` ఆగస్టు 11న రిలీజ్ కానుంది. అంటే.. చైతూ సినిమాలు బ్యాక్ టు బ్యాక్ మంత్స్ లో సందడి చేయనున్నాయన్నమాట.
ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే.. గతంలోనూ చైతూ ఇలా రెండు వరుస నెలల్లో సినిమాలతో పలకరించిన సందర్భాలున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే.. 2014 మేలో `మనం` విడుదల కాగా, జూన్ లో `ఆటోనగర్ సూర్య` తెరపైకి వచ్చింది. ఇక 2016 అక్టోబర్ లో `ప్రేమమ్` వినోదాలు పంచగా.. నవంబర్ లో `సాహసం శ్వాసగా సాగిపో` ఎంటర్టైన్ చేసింది. మరి.. ముచ్చటగా మూడోసారి బ్యాక్ టు బ్యాక్ మంత్స్ లో అలరించనున్న చైతూ.. ఈ సారి రెండు సినిమాలతోనూ విజయాలు అందుకుంటాడేమో చూడాలి.
![]() |
![]() |