![]() |
![]() |

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా కిరణ్ కొర్రపాటి తెరకెక్కించిన సినిమా 'గని'. అల్లు అరవింద్ సమర్పణలో రినైసెన్స్ పిక్చర్స్, అల్లు బాబీ కంపెనీ బ్యానర్స్ పై సిద్ధు ముద్దా, అల్లు బాబీ ఈ సినిమాని నిర్మించారు. సాయి మంజ్రేకర్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో జగపతిబాబు, సునీల్ శెట్టి, ఉపేంద్ర, నవీన్ చంద్ర కీలక పాత్రల్లో నటించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న గని ఏప్రిల్ 8న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఉగాది పర్వదినం పురస్కరించుకొని ఏప్రిల్ 2న వైజాగ్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా వచ్చాడు.
ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ.. "ఈ రోజు నాకు చాలా స్పెషల్. ఎందుకంటే మా ఫ్యామిలీలో నాన్నగారు అల్లు అరవింద్ తర్వాత తమ్ముడు శిరీష్ నిర్మాత అవుతాడు అనుకున్న.. కానీ హీరో అయ్యాడు. ఇప్పుడు మా అన్నయ్య అల్లు బాబి అధికారికంగా నిర్మాతగా మారి మొదటి సినిమా చేశాడు. అది నాకు చాలా సంతోషంగా ఉంది. ఇది బాబికి మొదటి సినిమా అయి ఉండొచ్చు కానీ నా ప్రతి సినిమా విషయంలో బాబి జడ్జిమెంట్ ఉంటుంది. 20 ఏళ్ళ అనుభవం మా అన్నయ్యకు ఉంది. తను ఒక కథ ఎంపిక చేసుకొని సినిమా చేసాడు అంటే ఖచ్చితంగా అది హిట్. సిద్దు ముద్దకు మా కజిన్ సిస్టర్ ని ఇచ్చాము. ఎక్కడో యూఎస్ లో జాబ్ చేసుకుంటూ ఎన్నో కష్టాలు పడి.. ఇండస్ట్రీకి వచ్చి ఈ రోజు ఒక నిర్మాతగా నిలబడ్డాడు. నా బ్రదర్ వరుణ్ తేజ్ గురించి చెప్పాలి. అతడు అంటే నాకు చాలా ఇష్టం. కేవలం కుటుంబ సభ్యుడిగానే కాకుండా నటుడిగా ఆయన ఎంచుకునే కథలు చాలా ఇష్టం. సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా ప్రతి కథలో ఒక నావెల్టీ ఉంటుంది. ఇలాంటి కథలు ఎంపిక చేసుకోవడం అందరు హీరోలకు సాధ్యం కాదు. గని సినిమా కోసం ఎంత కష్టపడ్డాడో నాకు తెలుసు. అన్ని రోజులు సిక్స్ ప్యాక్ మెయింటైన్ చేయాలి అంటే చిన్న విషయం కాదు. ప్రతి సినిమా కోసం కష్టపడతాడు కానీ గని కోసం ప్రాణం పెట్టాడు. దర్శకుడు కిరణ్ కొర్రపాటి గురించి చెప్పాలి. నేను సినిమా చూశాను.. చాలా బాగుంది అది ఎంత బాగుంది అనేది మీరు చెప్పాలి. అందుకే దర్శకుడు కిరణ్ కు అడ్వాన్స్ గా కంగ్రాచ్యులేషన్స్ చెప్తున్నాను. ఈ సినిమా ఖచ్చితంగా మిమ్మల్ని అలరిస్తుందని నమ్ముతున్నాను" అని అన్నాడు.
వరుణ్ తేజ్ మాట్లాడుతూ.. "గని సినిమా కోసం కరోనా సమయంలో కూడా మూడు సంవత్సరాలకు పైగా కష్టపడి ఈ సినిమా చేశాము. కచ్చితంగా ఇది మనల్ని అలరిస్తుందని నమ్ముతున్నాను. తెలుగులో అన్ని రకాల సినిమాలు వస్తున్నాయి స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ సినిమాలు ఎందుకు రావడం లేదని.. అప్పుడు కళ్యాణ్ గారు తమ్ముడు సినిమా చేశారు. ఆ రోజు సినిమా చేశారు కాబట్టే ఈ రోజు గని వచ్చింది. దర్శకుడు కిరణ్ కొర్రపాటి పదిహేనేళ్లుగా ఇండస్ట్రీలోనే ఉన్నాడు. వినాయక్, హరీష్ శంకర్ ఇలాంటి పెద్ద దర్శకులతో పనిచేసాడు. ఆ విషయంలో నేను తీసుకున్న నిర్ణయం కరెక్టే అని సినిమా చేసిన తర్వాత నాకు అర్థం అయింది. రేపు విడుదల అయిన తర్వాత మీకు తెలుస్తుంది. ఈ సినిమా కోసం సిక్స్ ప్యాక్ చేశాను దాని కోసం చరణ్ అన్న ఒక ట్రైనర్ ని ఇచ్చారు. బాక్సింగ్ ప్రాక్టీస్ మొదలు పెట్టాను. రేపొద్దున సినిమా చూస్తున్నపుడు ఎవరికీ ఫేక్ గా కనిపించకూడదు అని ఎన్నో రోజులు ప్రాక్టీస్ చేసిన తర్వాత సినిమా మొదలు పెట్టాను. నిర్మాతలు అల్లు బాబి, సిద్దు ముద్ద సినిమా కోసం ఎంతో కష్టపడ్డారు. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ఖర్చుకు వెనకాడకుండా సినిమాని నిర్మించారు. ఇందులో పనిచేసిన టెక్నికల్ టీమ్ అందరికీ థాంక్స్. అలాగే ఉపేంద్ర గారు, సునీల్ శెట్టి గారు, జగపతి బాబు గారు, నదియా గారి ఇలాంటి సీనియర్లతో వర్క్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా కచ్చితంగా మళ్లీ అలరిస్తుందని నమ్ముతున్నాను..' అని అన్నాడు.
దర్శకుడు కిరణ్ కొర్రపాటి మాట్లాడుతూ.. "ఈ సినిమా నాకు మూడేళ్ల కల. నా మీద నమ్మకంతో వరుణ్ తేజ్ గారు ఇంత పెద్ద ప్రాజెక్టు నాకు అప్పగించారు. పవన్ కళ్యాణ్ గారి కెరీర్లో తమ్ముడు సినిమా ఎలాంటి మైల్ స్టోన్ గా నిలిచిందో.. వరుణ్ తేజ్ గారికి గని సినిమా అలా మైల్ స్టోన్ అవుతుంది. ఇక మా నిర్మాతలు ఇద్దరు సినిమా కోసం ఎంతో కష్టపడ్డారు. అల్లు బాబి, సిద్దు గారికి దానికి థాంక్యూ. ప్రతి నిమిషం నాతో పాటు వాళ్ళు కూడా మూడు సంవత్సరాలు కృషి చేశారు. మధ్యలో కరోనా వచ్చిన కూడా వెనకడుగు వేయలేదు. అన్ని విషయాలు మాకు ముందుండి మా గురువు అల్లు అరవింద్ గారు అన్ని చూసుకున్నారు. ప్రతి విషయంలోనూ నన్ను, బాబి, సిద్ధుని ముందుకు నడిపించారు. ఈ సినిమా కోసం పనిచేసిన టెక్నికల్ టీమ్ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. సినిమా తీస్తే రికార్డులో ఉంటుంది.. హిట్టయితే చరిత్రలో ఉంటుంది.. ఖచ్చితంగా గని సినిమా పెద్ద హిట్ అవుతుంది. ఏప్రిల్ 8న థియేటర్లలో మీరే అది చూస్తారు" అని అన్నాడు.
![]() |
![]() |