![]() |
![]() |

అల్లు అర్జున్ హీరోగా నటించిన 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' సినిమాతో స్టార్ రైటర్ వక్కంతం వంశీ డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చాడు. ఎన్నో అంచనాల మధ్య 2018 విడుదలైన ఆ మూవీ పరాజయం పాలైంది. దీంతో దర్శకుడిగా రెండో అవకాశం రావడానికి చాలా టైం పట్టింది. తాజాగా నితిన్ హీరోగా ఓ మూవీకి శ్రీకారం చుట్టాడు.
వక్కంతం వంశీ దర్శకత్వంలో నితిన్ హీరోగా నటిస్తున్న మూవీ ఈరోజు పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. శ్రేష్ఠ్ మూవీస్ నిర్మిస్తున్న ఈ సినిమాలో 'పెళ్లి సందD' ఫేమ్ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. ముహూర్తపు సన్నివేశానికి రామ్ మోహన్ క్లాప్ కొట్టగా, ఉమేష్ గుప్తా కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ప్రముఖ డైరెక్టర్ సురేందర్ రెడ్డి గౌరవ దర్శకత్వం వహించాడు.

శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం.9 గా తెరకెక్కుతున్న ఈ సినిమాకి హారిస్ జయరాజ్ సంగీతం అందిస్తుండగా.. సినిమాటోగ్రాఫర్ గా సాయి శ్రీనివాస్ వర్క్ చేస్తున్నాడు.
ఇదిలా ఉంటే నితిన్ హీరోగా నటించిన 'మాచర్ల నియోజకవర్గం' జులై 8 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎడిటర్ ఎస్ఆర్ శేఖర్ ఈ సినిమాతో డైరెక్టర్ గా పరిచయమవుతున్నాడు.
![]() |
![]() |