![]() |
![]() |

గతంలో పబ్ లో దాడి ఘటనతో వార్తల్లో నిలిచిన బిగ్ బాస్-3 విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ మరోసారి వార్తల్లో నిలిచాడు. తాజాగా ఓ పబ్ పై దాడి చేసిన పోలీసులు రాహుల్ తో పాటు 150 మందిని అదుపులోకి తీసుకున్నారు. అందులో సినీ, రాజకీయ ప్రముఖుల పిల్లలు ఉన్నట్లు సమాచారం.
శనివారం రాత్రి హైదరాబాద్ బంజారాహిల్స్ లోని ర్యాడిసన్ బ్లూ హోటల్ పై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ క్రమంలోనే అందులోని ఫుడింగ్ మింగ్ పబ్ ను నిర్ణీత సమయానికి మించి నడుపుతున్నట్టు గుర్తించారు. దీంతో పబ్ యజమానితో పాటు ఆ సమయంలో రేవ్ పార్టీలో పాల్గొన్న 150 మందిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారట. వారిలో ఎక్కువగా సెలబ్రిటీల పిల్లలు ఉన్నట్లు సమాచారం. అందులో టాలీవుడ్ లో బడా ఫ్యామిలీకి చెందిన హీరోయిన్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో రాహుల్ తో పాటు స్టార్ డాటర్ ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. ఆమె తండ్రి ప్రముఖ నటుడు, నిర్మాత. అలాగే ఆమె సోదరుడు హీరోగా రాణిస్తున్నాడు. ఆమె కూడా టీవీ షోలు, వెబ్ సిరీస్ లు, సినిమాలలో సందడి చేసింది. కొంతకాలం క్రితం పెళ్లి చేసుకున్న ఆమె వెబ్ సిరీస్ లు నిర్మిస్తూ నిర్మాతగానూ సత్తా చాటుతోంది.
![]() |
![]() |