![]() |
![]() |

ఎన్నో అంచనాల మధ్య మార్చి 25 న విడుదలైన 'ఆర్ఆర్ఆర్' అంచనాలకు మించిన కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. ఓవరాల్ గా తొమ్మిది రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ మూవీ.. పదో రోజు నుంచి లాభాల బాట పట్టడం విశేషం.
తెలుగు రాష్ట్రాలలో బాహుబలి-2 తొమ్మిదో రోజు 6.51 కోట్ల షేర్ కలెక్ట్ చేయగా.. ఆర్ఆర్ఆర్ 19.62 కోట్లతో సంచలనం సృష్టించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో రూ.191 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ చేసిన ఆర్ఆర్ఆర్ తొమ్మిది రోజుల్లో 215.60 షేర్ రాబట్టి.. బాహుబలి-2 ఫుల్ రన్ 204 కోట్ల రికార్డును బ్రేక్ చేసింది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ఆల్ టైం రికార్డు సృష్టించిన ఆర్ఆర్ఆర్ ఫుల్ రన్ లో 250 కోట్లకు పైగా షేర్ రాబట్టే అవకాశముంది. నైజాంలో 70 కోట్ల బిజినెస్ చేసిన ఆర్ఆర్ఆర్ తొమ్మిది రోజుల్లో 90.10 కోట్ల షేర్ రాబట్టి 100 కోట్లకు చేరువైంది. సీడెడ్ లోనూ 37 కోట్ల బిజినెస్ చేసిన మూవీ 41.98 కోట్లు రాబట్టి ఆల్ టైం రికార్డు క్రియేట్ చేసింది. అలాగే ఆంధ్రాలో 83.52 కోట్లు(బిజినెస్ 84 కోట్లు)తో సత్తా చాటింది. నేడు ఆంధ్రాలోనూ బ్రేక్ ఈవెన్ సాధించనుంది.
వరల్డ్ వైడ్ గానూ ఆర్ఆర్ఆర్ ప్రభంజనం కొనసాగుతోంది. వరల్డ్ వైడ్ గా 451 కోట్ల బిజినెస్ చేసిన ఈ సినిమా తొమ్మిదిరోజుల్లోనే 452 కోట్ల షేర్ రాబట్టి నేటి నుంచి లాభాల బాట పట్టనుంది. తొమ్మిదో రోజు ప్రపంచవ్యాప్తంగా 37.12 కోట్ల షేర్(69 కోట్ల గ్రాస్) కలెక్ట్ చేసిన.. ఇప్పటిదాకా మొత్తం 452 కోట్ల షేర్(820 కోట్ల గ్రాస్ తో) సత్తా చాటింది.
తొమ్మిది రోజుల్లో ఓవర్సీస్ లో 79.50 కోట్లు(బిజినెస్ 75 కోట్లు), హిందీలో 80.10 కోట్లు(బిజినెస్ 92 కోట్లు), కర్ణాటకలో 32.05 కోట్లు(బిజినెస్ 41 కోట్లు), తమిళనాడులో 30.10 కోట్లు(బిజినెస్ 35 కోట్లు), కేరళలో 8.95 కోట్లు(బిజినెస్ 9 కోట్లు), రెస్టాఫ్ ఇండియా 5.70 కోట్లు(బిజినెస్ 8 కోట్లు) ఇలా అన్ని చోట్లా భారీ షేర్ తో దూసుకుపోతోంది. కర్ణాటక మినహా దాదాపు అన్ని చోట్లా నేడో రేపో బ్రేక్ ఈవెన్ సాధించనుంది.
![]() |
![]() |