![]() |
![]() |

తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వం సినిమా, టీవీ షూటింగులకు అనుమతులు మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకుంది. కొవిడ్–19 మార్గదర్శలు, లాక్‌డౌన్ నిబంధనలు అనుసరిస్తూ షూటింగులు చేసుకోవచ్చని చెప్పింది. ప్రభుత్వ నిర్ణయంపై మెగాస్టార్ చిరంజీవి హర్షం వ్యక్తం చేశారు. ‘‘వేలాదిమంది దినసరి వేతన కార్మికుల బతుకు తెరువుని దృష్టిలో ఉంచుకుని సినిమా, టీవీ షూటింగ్స్‌కి అనుమతి మంజూరు చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌గారికి, విధి విధానాలు రూపొందించి సహకరించిన శ్రీ తలసాని శ్రీనివాస యాదవ్‌గారికి, ప్రభుత్వ అధికారులకు కృతజ్ఞతలు’’ అని చిరంజీవి ట్వీట్ చేశారు.
తెలంగాణ ప్రభుత్వం షూటింగులకు అనుమతులు ఇవ్వడంతో చిన్న సినిమాలు కొన్ని షూటింగులకు రెడీ అవుతున్నాయి. పెద్ద సినిమాల్లో ఏవి షూటింగులకు రెడీ అవుతాయనేది ప్రశ్న. నటసింహం నందమూరి బాలకృష్ణ షూటింగ్‌కి రెడీ అని చెప్పిన సంగతి తెలిసిందే. ఆయన కాకుండా ఎన్టీఆర్, రామ్‌చరణ్ ‘ఆర్‌ఆర్‌ఆర్’ షూటింగ్ స్టార్ట్ చేయవచ్చని తెలిసింది. వెంకటేశ్, నాగార్జున కొన్ని రోజులు వేచిచూసే ధోరణిలో ఉన్నారు. ‘క్రాక్’ షూటింగ్ కొన్ని రోజులు బ్యాలెన్స్ ఉంది. రవితేజ అది పూర్తి చేయవచ్చు. రెండు మూడు రోజుల్లో ఎవరెవరు షూటింగ్స్ చేస్తారనేది క్లారిటీ వస్తుంది.
![]() |
![]() |