టార్గెట్ యాంకర్ శ్యామల.. ఆడేసుకుంటున్నారు
on Feb 22, 2022

బుల్లితెరపై యాంకర్‌గా ఆకట్టుకుంటోంది శ్యామల. గత కొంత కాలంగా నటిగా, యాంకర్‌గా రానిస్తోంది. ఆమె భర్త నరసింహారెడ్డి బుల్లితెరపై నటుడిగా కొనసాగుతున్నాడు. అయితే ఈ ఇద్దరు దంపతులపై తాజాగా టీడీపీ కన్నేసింది. గతంలో వీరు ఓ మహిళని అడ్డంగా మోసం చేశారంటూ శ్యామల దంపతులపై ప్రచారం మొదలుపెట్టింది. ఆమెని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా టీడీపీ వర్గాలు వరుస ట్వీట్ లు చేయడం ఆసక్తికరంగా మారింది. గత ఏడాది ఏప్రిల్ నెలలో యాంకర్ శ్యామల భర్తపై చీటింగ్ కేసు నమోదైన విషయం తెలిసిందే. యాంకర్ శ్యామల భర్త నరసింహారెడ్డి 2017 నుంచి తన వద్ద విడదల వారిగా కోటి రూపాయలు అప్పుగా తీసుకున్నాడని, తిరిగి ఇవ్వాలని అడిగితే బెదిరింపులకు పాల్పడటమే కాకుండా వేధింపులకు గురిచేశాడని ఓ మహిళ రాయదుర్గం పోలీసుల్ని ఆశ్రయించింది.

ఈ వ్యవహారంలో శ్యామల భర్తతో పాటు మధ్య వర్తిగా వ్యవహరించిన ఓ మహిళని పై చీటింగ్ కేసు నమోదు చేసి ఇద్దరినీ అరెస్ట్ చేశారు. ఆ తరువాత వారిని రిమాండ్ కు తరలించారు. దీంతో నెట్టింట శ్యామల, శ్యామల భర్తపై ట్రోలింగ్ జరిగింది. శ్యామల మాత్రం తన భర్త తప్పు చేయడని, చేయలేదని, సదరు మహిళ ఎవరో తనకు తెలియదని సైడ్ అయింది. అయితే యాంకర్ శ్యామల, ఆమె భర్త నరసింహారెడ్డి వైఎస్సార్ సీపీ సానుభూతి పరులు కావడంతో టీడీపీ వర్గాలు ఈ ఇద్దరినీ సోషల్ మీడియా వేదికగా టార్గెట్ చేయడం మొదలుపెట్టారు.
Also Read: రామ్ తో పూరి హీరోయిన్ రొమాన్స్!?
అయితే వీరిని టీడీపీ వర్గాలు సోషల్ మీడియా వేదికగా టార్గెట్ చేయడం, వీరు పేరున్న నేతలు కూడా కాకపోవడం ఆసక్తికరంగా మారింది. ఇంతకీ టీడీపీ వర్గాలు శ్యామల, ఆమె భర్తని ఎందుకు టార్గెట్ చేశారు? .. ఆ అవసరం ఏంటీ? అన్నది ఎవరికీ అంతుచిక్కడం లేదట. వీళ్ల వెంట పడటంలో ఆంతర్యమేంటని పలువురు ఇండస్ట్రీ వర్గాలు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



