![]() |
![]() |

పెళ్లయ్యిందంటే దాదాపుగా హీరోయిన్ల కెరీర్ ముగిసినట్లే..పుట్టింటి వారిని, మెట్టింటి వారిని ఒప్పించి సినిమాలు చేసినా మహా అయితే రెండు నుంచి మూడేళ్లు ఇండస్ట్రీలో ఉంటారు తప్పించి అంతకు మంచి కష్టం..అలా చాలా మంది టాప్ హీరోయిన్లు ఫేడ్ అవుట్ అయిపోయిన చరిత్ర మనకు తెలుసు..కానీ వారందరిని క్రాస్ చేస్తానంటోంది అక్కినేని ఇంటికి కోడలిగా వెళుతున్న సమంత. పెళ్లి తర్వాత సమ్ సినిమాలకు దూరమైపోతుందని అంతా భావించారు.
కానీ తను సినిమాల్లోకి చాలా కష్టపడి పైకి వచ్చింది. అలాంటప్పుడు ఆమె కెరీర్‌ను మధ్యలోనే ఆపివేసే అధికారం నాకు లేదు అని చైతన్య చెప్పాడు. దీనిని బట్టి పెళ్లి తర్వాత కూడా సమంత సినిమాల్లో కొనసాగుతుందని అర్థం చేసుకోవచ్చు. అందుకు తగ్గట్టుగానే ఎంగేజ్మెంట్ వరకు కాస్త సైలెంట్ అయిన సమ్..ఇక స్పీడ్ పెంచాలని భావిస్తోంది.
దీనిలో భాగంగా ఇప్పటికే రామ్‌చరణ్-సుకుమార్ సినిమాలో హీరోయిన్గా ప్లేస్ కన్ఫర్మ్ చేసుకుంది..మరోవైపు మామగారు నాగార్జున నటిస్తున్న రాజుగారి గది-2లో కూడా ఓ పాత్రలో కనిపించనుందట. ఈ సినిమాకు మరింత హైప్ పెంచే ఉద్దేశ్యంతో ఒక పాత్రను సమంత చేత చేయిస్తే బాగుంటుందని దర్శకుడు ఓంకార్ కింగ్ వద్ద ప్రస్తావించడంతో అందుకు నాగార్జున గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు ఫిలింనగర్ టాక్. మరి ఈ వార్తలో ఎంత వరకు నిజమో మరికొద్ది రోజుల్లో తెలిసిపోనున్నది.
![]() |
![]() |