![]() |
![]() |

అందం, ఆకట్టుకునే చిరునవ్వుతో బుల్లితెరపై స్టార్ యాంకర్‌గా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది లాస్య. ముఖ్యంగా యాంకర్ రవితో కలిసి ఆమె చేసిన అల్లరి అంతా ఇంతా కాదు..ప్రస్తుతం ఈ అమ్మడు టీవీ షోలతో పాటు ఆడియో ఫంక్షన్లకు హోస్ట్‌గా వ్యవహరిస్తూ చాలా బిజీగా ఉంటోంది..అంతేనా ప్రజంట్ సినిమాలలో నటించడానికి కూడా రెడీ అయ్యింది.."రాజా మీరు కేక" అనే సినిమాలో నటిస్తున్నట్లు లాస్య ప్రకటించింది. యాంకర్లు అన్నాకా రూమర్లు సహజం..ఇందుకు లాస్య కూడా అతీతం కాదు..అందుకు తగ్గట్టుగానే ఈవిడపై బోలెడన్నీ రూమర్లు వచ్చాయి..కానీ వాటిలో ఏమాత్రం నిజం లేదని ప్రకటించింది లాస్య.
ప్రజంట్ కెరీర్ జెట్ స్పీడుతో దూసుకెళ్తోన్న ఇలాంటి సమయంలో ఎవ్వరూ ఊహించని ప్రకటన చేసింది ఈ అమ్మడు. అదే ఎంగేజ్‌మెంట్. జీవితంలో ప్రత్యేకమైన రోజు కోసం రెడీ అవుతున్నందుకు ఎంతో ఆనందంగా ఉంది. నా సోల్‌మెట్‌తో ఎంగేజ్‌మెంట్ జరుగుతున్నందుకు చాలా ఎగ్జైటింగ్‌గా ఉందని తన ఎంగేజ్‌మెంట్ ఫోటోను పోస్ట్ చేసింది లాస్య. అంతా బాగానే ఉంది కానీ..ఈ ఎంగేజ్‌మెంట్‌కు సంబంధించి కేవలం తన ఫోటోను మాత్రమే పోస్ట్ చేసి..కాబోయే భర్త ఎవరో చెప్పకుండా అభిమానులను సస్పెన్స్‌లో పెట్టింది.

![]() |
![]() |