![]() |
![]() |

నిజ జీవిత గాధలు, చారిత్రాక కథాంశాలతో సినిమాలు తీసి వాటితో కమర్షియల్ హిట్లు కొడుతుంటారు బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ. తాజాగా ఢిల్లీ సుల్తాన్ అల్లావుద్దీన్ ఖిల్జీ, మేవాడ్ మహారాణి పద్మినిల జీవిత కథను కథాంశంగా తీసుకుని ఆయన పద్మావతి అనే సినిమాను చిత్రీకరిస్తున్నారు. దానిలో భాగంగా ఇటీవల జైపూర్‌లో జరిగిన షూటింగ్‌ను రాజ్పుట్ కర్ని సేన సభ్యులు అడ్డుకున్నారు..సెట్‌ను ధ్వంసం చేసి, భన్సాలీపై దాడి చేశారు. ఆయన్ను చెంపదెబ్బ కొట్టి జుట్టు పట్టుకుని లాక్కెళ్లారు. దీనిని బాలీవుడ్ తీవ్రంగా ఖండించింది. ఈ గొడవ అనంతరం భన్సాలీ వివరణ ఇచ్చారు.
ఈ సినిమాలో అభ్యంతరకర సన్నివేశాలు లేవని, రాణి పద్మణి, అల్లావుద్దిన్ ఖిల్జీ మధ్య ఎలాంటి ప్రేమ సన్నివేశాలు లేవని చెప్పారు. అయినా శాంతించని రాజ్పుట్ వర్గీయులు..సినిమా టైటిల్‌ను మార్చాలని, విడుదలకు ముందు తమకు చూపించాలని వాడు డిమాండ్ చేశారు. మరోవైపు భన్సాలీని చెప్పుతో కొట్టిన వారికి పదివేల రూపాయల బహుమతి ఇస్తానని ప్రకటించారు మధ్యప్రదేశ్‌కు చెందిన బీజేపీ నేత అఖిలేష్ ఖండెవాల్...మహారాణి పద్మిని చరిత్రను వక్రీకరించి, ఆమెను అగౌరవ పరచేందుకు భన్సాలీ ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.
![]() |
![]() |