![]() |
![]() |

హీరోయిన్లు ప్రేమలో పడటం చాలా కామన్..కానీ అల్రెడీ పెళ్లయి..ఇద్దరు పిల్లలకు తండ్రిగా ఉన్న వ్యక్తిని ప్రేమించడం మాత్రం హీరోయిన్లకే చెల్లింది..బాలీవుడ్ నుంచి టాలీవుడ్ దాకా ఇప్పటి వరకు ఇలాంటి "సెకండ్ హ్యాండ్" ప్రేమ పురాణాలు విన్నాం..చూశాం..తాజాగా ఇద్దరు స్టార్ హీరోయిన్లు ఇదే తరహా ప్రేమాయణం నడుపుతూ వార్తల్లోకి ఎక్కారు. వారే బాలీవుడ్ ముద్దుగుమ్మలు శ్రద్దాకపూర్, సోనాక్షీ సిన్హా.

శ్రద్దాకపూర్ సంగతి చూస్తే..నటుడు, దర్శకుడు ఫర్హాన్ అక్తర్‌తో ఈ అమ్మడు పీకల్లోతు ప్రేమలో మునిగిపోయిందట. ఎంతలా అంటే ఇద్దరూ కలిసి ఒకే ఇంట్లో ఉండేంతలా...తన కూతురు రోజుల తరబడి ఇంటికి రాకపోవడంతో అనుమానం వచ్చిన శ్రద్దాకపూర్ తండ్రి శక్తీకపూర్ అసలు విషయం తెలుసుకుని నేరుగా ఫర్హాన్ అక్తర్ ఇంటికి వెళ్లి కూతురిని ఇంట్లో నుంచి లాక్కొచ్చేశాడట. ఈ విషయం బీ-టౌన్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

ఇక అలనాటి బాలీవుడ్ నటుడు శతృఘ్న సిన్హా గారాలపట్టి సోనాక్షి సిన్హాకు కూడా పెళ్లయిన వాడే కావాలట. కండలవీరుడు సల్మాన్ సోదరుడు సోహైల్ ఖాన్ భార్య సీమాఖాన్ తమ్ముడు బంటీతో సోనాక్షీ చెట్టాపట్టాలెసుకొని తిరుగుతోందట. బంటీకి అప్పటికే అంబికా చౌహన్‌తో వివాహమైంది. నాలుగేళ్ల వైవాహిక జీవితం తర్వాత వీరు విడాకులు తీసుకొన్నారు. కానీ దియామీర్జా, ఇతర బాలీవుడ్ హీరోయిన్లతో డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి..అలాంటి బంటీతో సోనాక్షీ చాలా సన్నిహితంగా తిరుగుతోందట..త్వరలోనే వీరిద్దరికి ఎంగేజ్‌మెంట్ కూడా జరగనుందని బీటౌన్ టాక్.
![]() |
![]() |