![]() |
![]() |

ప్రస్తుతం తెలుగు సినిమాకు పెద్ద దిక్కుగా ఉన్న ప్రఖ్యాత దర్శకులు, దర్శకరత్న దాసరి నారాయణ రావు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శ్వాసకోశ సంబంధిత సమస్యతో ఆయన కిమ్స్‌లో చేరారు. ఓవర్‌వెయిట్, ఊపిరితిత్తుల సమస్యలతో ఆయన బాధపడుతున్నారని వైద్యులు తెలిపారు. అవసరమైతే సర్జరీ చేయాల్సి రావచ్చని వారు చెప్పారు. దాసరి ఆసుపత్రిలో చేరిన విషయాన్ని తెలుసుకున్న పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులు పెద్ద సంఖ్యలో కిమ్స్‌కు చేరుకుని ఆయన్ను పరామర్శించారు.
![]() |
![]() |