![]() |
![]() |

భారతీయ సినీప్రేక్షకుల్లో 'సల్మాన్ ఖాన్'(Salman Khan)కి ఉన్న చరిష్మా గురించి తెలిసిందే. మూడున్నర దశాబ్దాలుగా తనదైన నటనతో, డాన్స్ లతో లక్షలాది మంది అభిమానులని అలరిస్తు వస్తున్నాడు. ఈ ఏడాది ప్రారంభం మార్చిలో 'సికందర్' తో సిల్వర్ స్క్రీన్ పై మెరవగా, బాటిల్ ఆఫ్ గల్వాన్' అనే కొత్త చిత్రాన్ని స్టార్ట్ చేసాడు. షూటింగ్ దశలో ఉన్న ఈ మూవీ దేశభక్తి నేపథ్యంలో తెరకెక్కుతుంది.
సీనియర్ హీరోయిన్లు కాజోల్, ట్వింకిల్ ఖన్నా హోస్ట్ లుగా అమెజాన్ ప్రైమ్(Amazon Prime)లో 'టూ మచ్ కాజోల్ విత్ ట్వింకిల్ షో' స్ట్రీమింగ్ అవుతు ఉంది. ఈ షో కి రీసెంట్ గా మరో బడా హీరో అమీర్ ఖాన్(Aamir Khan)తో కలిసి సల్మాన్ గెస్ట్ గా హాజరయ్యాడు. ఈ సందర్భంగా సల్మాన్ ని ఉద్దేశించి ట్వింకిల్ మాట్లాడుతూ సల్మాన్ తనని తాను ఎప్పుడో నవ మన్మధుడుగా పేర్కొన్నాడు. నాకు తెలిసి సల్మాన్ కి డజను మంది పిల్లలు ఉండి ఉండవచ్చు. కాకపోతే వాళ్ళ గురించి మనకి తెలియదు. చివరకి సల్మాన్ కి కూడా తెలియదని సరదాగా చెప్పుకొచ్చింది. ఆ తర్వాత సల్మాన్ మాట్లాడుతూ నాకు పిల్లలు ఉంటే నీకు తెలియకుండా ఉంటుందా! అసలు వాళ్ళని మీ ముందుకు తీసుకురాకుండా ఉంటానా! కానీ ఒక్కటి మాత్రం నిజం నాకు పిల్లలు కావాలి. దత్తత మాత్రం తీసుకోను, ఖచ్చితంగా ఒకరు ఉంటారు. అంతా దేవుడి దయ అని చెప్పుకొచ్చాడు.
సల్మాన్ చెప్పిన ఈ మాటలు భారతీయ సినీ సర్కిల్స్ లో వైరల్ గా మారాయి. అభిమానులు అయితే ఎప్పట్నుంచో సల్మాన్ ని పెళ్లి కొడుకుగా చూడాలని అనుకుంటున్నారు. అలాంటిది సల్మాన్ చెప్పిన మాటలతో వాళ్ళ ఆనందం అంతా ఇంతా కాదు. వచ్చే డిసెంబర్ లో సల్మాన్ ఆరుపదుల వయసులోకి అడుగుపెట్టబోతున్నాడు. ఈ సందర్భంగా అయినా తన జీవితంలోకి లైఫ్ పార్టనర్ ని ఆహ్వానిస్తాడేమో చూడాలి.

![]() |
![]() |