![]() |
![]() |

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) మోస్ట్ అవైటెడ్ మూవీ 'ఓజీ' (OG) తాజాగా థియేటర్లలో అడుగుపెట్టింది. దీంతో ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేతిలో హరీష్ శంకర్ డైరెక్షన్ లో చేస్తున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' మాత్రమే ఉంది. ప్రస్తుతం పవన్ పాలిటిక్స్ తో బిజీగా ఉన్నారు. దీంతో ఇక ఆయన లాస్ట్ మూవీ 'ఉస్తాద్' అవుతుందని అందరూ భావించారు. పవన్ కళ్యాణ్ సైతం 'హరి హర వీరమల్లు' ప్రమోషన్స్ సమయంలో.. నటుడిగా సినిమాలు చేయడానికి కుదరకపోవచ్చని, నిర్మాతగా సినిమాలు చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు. ఆ ప్రకటనతో ఫ్యాన్స్ ఎంతో నిరాశ చెందారు. తమ హీరోని బిగ్ స్క్రీన్ మీద ఒకట్రెండు సార్లు కంటే ఎక్కువ చూసుకోలేమని ఫీల్ అయ్యారు. అయితే ఇప్పుడు ఫ్యాన్స్ ని ఖుషీ చేస్తూ.. పవన్ కొత్త సినిమా ప్రకటన వచ్చింది. ఆ సినిమా మరేదో కాదు.. ఓజీ సీక్వెల్. (They Call Him OG)
బుధవారం(సెప్టెంబర్ 24) రాత్రి ప్రీమియర్స్ తో థియేటర్లలో 'ఓజీ' సందడి మొదలైంది. ఈ సినిమాకి ఫ్యాన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ఓజాస్ గంభీరగా పవన్ కళ్యాణ్ ని దర్శకుడు సుజీత్ చూపించిన తీరుకి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఇంట్రో సీన్, ఇంటర్వెల్ బ్లాక్, పోలీస్ స్టేషన్ వార్నింగ్ సీన్.. ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పిస్తున్నాయి. అభిమానుల ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తూ.. సినిమా చివరిలో ఓజీ పార్ట్-2 కూడా ఉందని ప్రకటించారు. ఇది ఫ్యాన్స్ కి బిగ్ సర్ ప్రైజ్ అని చెప్పవచ్చు.
Also Read: ఓజీ మూవీ రివ్యూ
ఓజీలో పవన్ కళ్యాణ్ పోషించిన గంభీర పాత్రకు సంబంధించిన ముంబై కథను చూపించారు. జపాన్ లో గంభీర ఏం చేశాడనేది సెకండ్ పార్ట్ లో చూపించనున్నారు. అంతేకాదు, తన గత చిత్రం 'సాహో'ని టచ్ చేస్తూ.. 'ఓజీ'తో సినిమాటిక్ యూనివర్స్ స్టార్ట్ చేశాడు సుజీత్. అంటే ఓజీ పార్ట్-2 లో జపాన్ కథతో పాటు, సాహోలోని పాత్రలు కూడా కనిపించబోతున్నాయి అన్నమాట.
గత కొన్నేళ్లలో ఏ సినిమాకి రానంత హైప్ 'ఓజీ'కి వచ్చింది. సినిమా చూసి థియేటర్లలో ఫ్యాన్స్ ఊగిపోతున్నారు. ఈ మూవీ పవన్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలవడం ఖాయమని ట్రేడ్ వర్గాల అంచనా. అందుకే అప్పుడే 'ఓజీ-2' కోసం ఫ్యాన్స్ ఎక్సైట్ అవుతున్నారు. వచ్చే ఏడాది ఇది మొదలయ్యే ఛాన్స్ ఉంది అంటున్నారు. మొత్తానికి 'ఓజీ-2' ప్రకటనతో పవన్ యాక్టింగ్ కంటిన్యూ చేస్తున్నారన్న క్లారిటీ రావడంతో.. ఫ్యాన్స్ ఎంతో సంబరపడుతున్నారు.
![]() |
![]() |