![]() |
![]() |

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఓజాస్ గంభీరగా గర్జించిన 'ఓజీ' (OG) చిత్రం తాజాగా థియేటర్లలో అడుగుపెట్టింది. ఈ సినిమా చూస్తూ థియేటర్లలో అభిమానులు పూనకాలతో ఊగిపోతున్నారు. పవన్ కనిపించిన ప్రతి సీన్ ఎలివేషన్ లా ఉందంటూ.. డైరెక్టర్ సుజీత్ ని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. అదే సమయంలో ఓ విషయంలో మాత్రం పవర్ స్టార్ ఫ్యాన్స్ నిరాశచెందుతున్నారు. మూవీ టీమ్ మంచి ఛాన్స్ మిస్ చేసుకుందని వారు అభిప్రాయపడుతున్నారు. (They Call Him OG)
'ఓజీ' సినిమాతో పవన్ కళ్యాణ్ తనయుడు అకీరా నందన్.. తెలుగు తెరకు పరిచయం అవుతున్నట్లు గతంలో ప్రచారం జరిగింది. పవన్ టీనేజ్ రోల్ లో అకీరా కనిపిస్తాడని బలంగా వార్తలు వినిపించాయి. కానీ, తీరా సినిమా విడుదలయ్యాక చూస్తే.. ఇందులో అకీరా లేడు.
Also Read: ఓజీ మూవీ రివ్యూ
నిజానికి ఈ సినిమాలో టీనేజ్ ఓజీ పాత్రను కూడా బాగా చూపించారు. అసలు ఆ పాత్ర ఇంట్రో సీన్ వస్తుంటే.. అది చేసింది అకీరానే అయ్యుంటాడని అభిమానులు వేయి కళ్ళతో ఎదురుచూశారు. కానీ, ఫేస్ రివీల్ అయ్యాక అకీరా కాదని తెలియడంతో.. వారు నిరాశ చెందారు. ఒకవేళ ఓజీలో టీనేజ్ పాత్ర నిజంగానే అకీరా చేసుంటే మాత్రం.. ఫ్యాన్స్ ఉత్సాహం రెట్టింపు అయ్యేది అనడంలో సందేహం లేదు. పైగా, అకీరాకు కూడా ఇది మంచి డెబ్యూ అయ్యేది.

![]() |
![]() |