![]() |
![]() |

అగ్ర హీరో 'జయం రవి'(Jayam Ravi)కి తమిళ చిత్ర చిత్ర పరిశమ్రలో ఉన్న పేరు ప్రఖ్యాతులు గురించి అందరకి తెలిసిందే. యాక్షన్ అండ్ స్టైలిస్ట్ చిత్రాలకి పెట్టిందిపేరైన జయం రవి, ఇంజమ్ బాకమ్ లో ఉన్న తన ఇంటి నిర్మాణం కోసం ఒక ప్రవైట్ బ్యాంక్ నుంచి భారీ మొత్తంలో రుణం తీసుకున్నాడు. కానీ వాయిదాలు కట్టకపోవడంతో సుమారు 7 .60 కోట్ల రూపాయల వరకు బ్యాంక్ కి బాకీ పడ్డాడు. ఈ విషయంపై బ్యాంక్ అధికారులు ఎన్ని సార్లు నోటీసులు పంపించినా జయం రవి నుంచి సరైన స్పందన రాలేదని అధికారులు చెప్పారు.
దీంతో బ్యాంక్ అధికారులు జయం రవి ఇంటికి నోటీసులు అంటించారు. రూల్స్ ప్రకారం సదరు ఇంటిని వేలం కూడా వేసేందుకు కూడా అధికారులు సిద్దమయ్యారనే వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సినిమాల పరంగా చూసుకుంటే నిత్యామీనన్ తో కలిసి పొంగల్ కి 'కాదలిక్క నెరమిల్లై' తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ప్రస్తుతం పరాశక్తి, కరాటే బాబు, జెనీ, బ్రో కోడ్, తని ఒరువన్ పార్ట్ 2 చిత్రాలు జయం రవి లిస్ట్ లో ఉన్నాయి.
తెలుగులో ఎన్నో హిట్ చిత్రాలని రూపొందించిన ప్రముఖ నిర్మాత ఎడిటర్ మోహన్ కొడుకే జయం రవి. ఇటీవల జయం రవి, భార్య ఆర్తి నుంచి విడాకులు కోరిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ కేసు కోర్ట్ పరిధిలో ఉంది. కాకపోతే భార్య ఆర్తిని ఇబ్బందుల పాలు చేయడానికి ఒక పథకం ప్రకారమే జయం రవి లోన్ కట్టకుండా, ఇంటిని వేలం వరకు తీసుకొచ్చాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరో వైపు టచ్ గోల్డ్ యూనివర్సల్ అనే నిర్మాణ సంస్థకి జయం రవి రెండు సినిమాలు చేస్తానని ఒప్పందం చేసుకొని 6 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నాడని. కానీ వారికి చేయకుండా వేరే సినిమాలు ఒప్పుకున్నాడట. దాంతో ఆ నిర్మాణ సంస్థకు చెందిన వారు బ్యాంక్ వారిని అప్రోచ్ అయి రవి ఇల్లును జప్తు చేయాలని కోరినట్టుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అసలు నిజం ఏంటనేది తెలియాలి.
![]() |
![]() |