![]() |
![]() |

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan)అభిమానుల సుదీర్ఘ నిరీక్షణకు తెర దించుతు 'ఓజి'(OG)నిన్నటి నుంచే వరల్డ్ వైడ్ గా ప్రీమియర్స్ తో సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెట్టింది. అభిమానులు, ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంటున్న ఓజి ని పలువురు సినీ ప్రముఖులు కూడా చేసి పవన్ ఈసారి తన రేంజ్ కి తగ్గ హిట్ ని అందుకున్నాడనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
రీసెంట్ గా పవన్ సోదరుడు 'మెగాస్టార్ చిరంజీవి'(Chiranjeevi)ఎక్స్(X)వేదికగా 'ఓజి' పై స్పందిస్తు కళ్యాణ్ బాబుని అందరు ది ఓజి - ఓజాస్ ఘంబీరాగా సెలబ్రేట్ చేసుకోవడం ఆనందంగా ఉంది. ఓజి విజయం సాధించినందుకు పవన్ కళ్యాణ్, సుజీత్(Sujeeth),దానయ్య, ఇమ్రాన్ హష్మీ, ప్రియాంక మోహన్ ఇలా ఓజి లో భాగమైన అందరికి కంగ్రాట్స్ అని ట్వీట్ చేసాడు.
ఇక ఓజి తొలి రోజు రికార్డు కలెక్షన్స్ సాధించే అవకాశం ఉందని సినీ ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రేపు ప్రకటించే ఆ కలెక్షన్స్ వివరాలు కోసం అందరు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. పక్కా యాక్షన్ అండ్ స్టైలిస్ట్ ఎంటర్ టైనర్ గా ఓజి తెరకెక్కింది.
![]() |
![]() |