![]() |
![]() |

తక్కువమంది చూసే హారర్ థ్రిల్లర్ జానర్.. సెన్సార్ నుంచి A సర్టిఫికెట్.. విడుదల రోజు నెగటివ్ రివ్యూలు... ఇవి చాలవు అన్నట్టుగా అదే రోజు విడుదలైన మరో మూవీకి పాజిటివ్ రివ్యూలు. ఇలాంటి పరిస్థితుల్లో ఓ సినిమా బాక్సాఫీస్ దగ్గర నిలదొక్కుకోగలదా? దాదాపు అసాధ్యం కదా. అలాంటి అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించింది 'కిష్కింధపురి'(Kishkindhapuri).
ఈ సెప్టెంబర్ 12న 'మిరాయ్', 'కిష్కింధపురి' సినిమాలు విడుదలయ్యాయి. 'మిరాయ్'పై మొదటి నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. పైగా, అన్ని వర్గాలకు చేరువయ్యే జానర్ అది. కానీ 'కిష్కింధపురి' అలా కాదు. హారర్ థ్రిల్లర్ జానర్, పైగా A సర్టిఫికెట్. దానికితోడు నెగటివ్ రివ్యూలు. దీంతో 'కిష్కింధపురి' ఇక బాక్సాఫీస్ దగ్గర నిలబడదని, అనవసరంగా 'మిరాయ్'కి పోటీగా విడుదల చేశారనే కామెంట్స్ వినిపించాయి. కానీ, అందరి అంచనాలను తలకిందులు చేస్తూ.. 'కిష్కింధపురి' మంచి వసూళ్లతో సత్తా చాటుతోంది.
ట్రేడ్ లెక్కల ప్రకారం, మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.3.50 కోట్ల గ్రాస్ తో పరవాలేదు అనిపించుకున్న 'కిష్కింధపురి'.. రెండో రోజు, మూడో రోజు అంతకుమించిన వసూళ్లు రాబట్టడం విశేషం. రెండో రోజు రూ.4.40 కోట్ల గ్రాస్, మూడో రోజు 4.60 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. దీంతో మొదటి మూడు రోజుల్లోనే రూ.12.50 కోట్ల గ్రాస్ సాధించింది. ఇక నాలుగో రోజు సోమవారం అయినప్పటికీ బుక్ మై షోలో గంటకు 1.3K టికెట్లు బుక్ అవుతూ ట్రెండింగ్ లో ఉంది. ఆ జానర్, ఆ బడ్జెట్ పరంగా చూస్తే.. ఈ మూవీ మండే టెస్ట్ పాస్ అయినట్టే లెక్క. ఇదే జోరు కొనసాగితే.. ఫుల్ రన్ లో ఈ చిత్రం రూ.20 కోట్ల గ్రాస్ రాబట్టే అవకాశముంది. అదే జరిగితే.. 'కిష్కింధపురి' సినిమా హిట్ స్టేటస్ దక్కించుకున్నట్లే.
![]() |
![]() |