![]() |
![]() |

ప్రస్తుతం రెండు తెలుగు రాష్టాల్లో 'మిరాయ్'(Mirai)హుంగామ కొనసాగుతూ ఉంది. మొన్న 12 న థియేటర్స్ లోకి అడుగుపెట్టిన మిరాయ్, తొలి రోజు 'నాలుగు షోస్' తో ప్రారంభమయ్యి ,శనివారం నుంచి ఐదు షో లని ప్రదర్శించుకుంది. దీంతో తొలి మూడు రోజుల్లోనే 81 కోట్ల గ్రాస్ ని అందుకొని, త్వరలోనే 100 కోట్ల క్లబ్ లోకి ప్రవేశించబోతుంది. ఈ ప్రభంజనం ఇలాగే కొనసాయితే పూర్తి రన్నింగ్ లో ఎవరు ఊహించని కలెక్షన్స్ ని రాబడుతుందనే వార్తలు సినీ సర్కిల్స్ లో వినిపిస్తున్నాయి. హిందీ బెల్ట్ లో ఒక టికెట్ కొంటే ఇంకో టికెట్ ఫ్రీ అని ప్రకటించడం కూడా మిరాయ్ కి కలిసొచ్చే అవకాశంగా భావించవచ్చు.
తాజాగా సోషల్ మీడియాలో ఒక నెటిజన్ 'మిరాయ్' చిత్రాన్ని ఉద్దేశిస్తు ఒక పోస్ట్ చేసాడు. సదరు పోస్ట్ లో 'మిరాయ్' చాలా అద్భుతంగా తెరకెక్కించారు. కానీ సూపర్ స్టార్ 'కృష్ణ'(Krishna)గతంలో నటించిన 'మహాబలుడు' చిత్రానికి మక్కీకి మక్కీ కాపీ గా దించినట్టు కనబడడంలో ఆశ్చర్యం లేదు 1969 ఏప్రిల్ 18 న 'మహాబలుడు' వచ్చిందంటు, ఆ చిత్రానికి సంబంధించిన లింక్ ని షేర్ చేసాడు. ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో మిరాయ్ డైరెక్టర్ త్రివిక్రమ్(Trivikram)కి శిష్యుడిలా ఉన్నాడని కొంత మంది కామెంట్స్ చేస్తుంటే, మరికొందరు మాత్రం మహాబలుడు’ చిత్రానికి ‘మిరాయ్’కి ఎలాంటి సంబంధం లేదని, అగస్త్య మహర్షి, తల్లి సెంటిమెంట్, కథ, క్యారెక్టర్లు కూడా ఏవీ ఒకేలా లేవనే కామెంట్స్ చేస్తున్నారు.
జానపద కథాచిత్రంగా తెరకెక్కిన 'మహాబలుడు'(Mahabaludu)లో కృష్ణ 'ప్రతాప సింహుడు' అనే యువరాజు క్యారక్టర్ ని పోషించాడు. వేరే దేశపు యువరాణి 'ఇంద్రప్రభాదేవి'(వాణిశ్రీ) ని ఇష్టపడి, తన జీవిత భాగస్వామిగా చేసుకోవాలనుఉంటాడు. ఇంద్ర ప్రభాదేవి కూడా ప్రతాప సింహుడిని ఇష్టపడుతుంది. ఆమె దైవాంశ సంభూతురాలతో పాటు, మహిమాన్నితమైన దివ్యమణిని కలిగి ఉంటుంది. ఆ దివ్యమణిని సొంతం చేసుకోవాలని కొన్ని దుష్ట శక్తులు ప్రయత్నిస్తుంటాయి. ఈ క్రమంలో దుష్ట శక్తుల దగ్గర నుంచి ప్రతాప సింహం, ఇంద్ర ప్రభాదేవి పెళ్ళికి సమస్యలు ఎదురవుతాయి. ప్రతాప సింహం చేసే పోరాటంలో అగశ్య మహర్షి తోడుగా ఉండటం వల్ల ప్రతాప సింహం కి కొన్ని శక్తులు దక్కి 'మహాబలుడు' అవుతాడు. దీంతో దుష్ట శక్తిని అంతం చేసి, ఇంద్ర ప్రభాదేవిని ఎలా దక్కించుకున్నాడు. 'మణి' ని ఎలా కాపాడాడు అనే అంశాలతో' మహాబలుడు' తెరకెక్కింది. 'మిరాయ్' స్టోరీ ఇందుకు భిన్నంగా తెరకెక్కిన విషయం తెలిసిందే.

![]() |
![]() |